Movie News

ప్రభాస్‌ అంటే భయం లేదా?

‘బాహుబలి’తో ప్రభాస్ ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. బాలీవుడ్ వాళ్లు కూడా అతణ్ని చూసి భయపడే పరిస్థితి వచ్చింది. అతడి చిత్రాలకు పోటీగా హిందీ సినిమాలు రిలీజ్ చేయడానికి వెనుకంజ వేశారు. ‘సాహో’ పోటీ లేకుండా విడుదలైంది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి బాలీవుడ్ ఆలోచన మారినట్లుంది.

ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ జులై 30కి షెడ్యూల్ అయిందని తెలిసి కూడా ఓ చిత్రాన్ని అదే రోజు బాక్సాఫీస్ బరిలో నిలిపారు. అది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ సినిమా పేరు.. గంగూబాయ్ కతియావాడీ. ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఇందులో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు ఈ రోజే ప్రకటించారు.

‘సాహో’తో పోలిస్తే ‘రాధేశ్యామ్’ మీద అంచనాలు తక్కువే. పైగా ప్రభాస్ నుంచి ఉత్తరాది ప్రేక్షకులు మాస్ సినిమాలే ఆశిస్తున్నారు. అతను క్లాస్ లవ్ స్టోరీ చేస్తున్నాడనేసరికి ‘రాధేశ్యామ్’ మీద అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. పైగా ఇటీవల రిలీజైన ‘రాధేశ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్ నిరాశ పరిచింది. దీనిపై బాలీవుడ్ క్రిటిక్స్ విమర్శలు గుప్పించారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నెమ్మదిగా ఉత్తరాదిన స్టార్ డమ్ కోల్పోతున్నాడని వ్యాఖ్యానించారు.

ఐతే ప్రభాస్ తర్వాత చేయబోయే మూడు సినిమాల మీద బాగానే ఆసక్తి ఉంది కానీ.. ‘రాధేశ్యామ్’ మీదే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సినిమాకు భయపడాల్సిన పని లేదని బన్సాలీ టీం భావించినట్లుంది. బన్సాలీ సినిమా అంటే ఆషామాషీగా ఏమీ ఉండదు. ఆయన బలమైన కథతోనే రంగంలోకి దిగి ఉంటారు. ప్రభాస్ సినిమా బాగున్నా కూడా తమ చిత్రానికి కూడా బాక్సాఫీస్ దగ్గర స్కోప్ ఉందని చిత్ర బృందం జులై 30కి సినిమా షెడ్యూల్ చేసి ఉండొచ్చు.

This post was last modified on February 24, 2021 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

56 minutes ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

1 hour ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

1 hour ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

2 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

2 hours ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

2 hours ago