ఒక పరభాషా నటుడికి తెలుగులో కొంచెం క్రేజ్ వచ్చిందంటే చాలు. ఇక అతను ఇంతకుముందు నటించిన చిత్రాల్ని డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలైపోతుంది. ఇంతకుముందు చాలా మంది తమిళ నటుల విషయంలో ఇదే జరిగింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు ‘జనతా గ్యారేజ్’తో క్రేజ్ రావడంతో ‘మన్యంపులి’ సహా వరుసగా ఆయన మలయాళ చిత్రాల్ని అనువాదం చేసి రిలీజ్ చేయడం తెలిసిన సంగతే.
ఇప్పుడు విజయ్ సేతుపతి విషయంలోనూ ఇలాగే జరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘మాస్టర్’; ‘ఉప్పెన’ చిత్రాలతో సేతుపతికి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఈ రెండు సినిమాలకు అతను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సేతుపతి తెరపై కనిపించినపుడు థియేటర్లలో వచ్చిన స్పందన చూస్తే అతడికి ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇకపై తమిళంలో సేతుపతి నటించే సినిమాలన్నీ తెలుగులోకి వచ్చేసేలా ఉన్నాయి.
సేతుపతి ఇంతకుముందు చేసిన ఓ సెన్సేషనల్ మూవీని హఠాత్తుగా తెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. సమంత కూడా ఓ కీలక పాత్ర చేసిన ఆ సినిమా పేరు.. సూపర్ డీలక్స్. ఇది ఒక అసాధారణ కథతో తెరకెక్కిన సంచలన చిత్రం. ఇందులో సేతుపతి లింగ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిన వ్యక్తిగా కనిపించడం విశేషం. సినిమాలో అతడి పాత్ర చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రతో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తాయి.
కొందరు అవి జీర్ణించుకోలేరు కూడా. అలాగే సమంత పాత్ర సైతం సెన్సేషనల్‌గానే ఉంటుంది. సినిమా ఆరంభంలోనే ఆ పాత్రకు సంబంధించి పెద్ద ట్విస్టుంటుంది. సమంతను తెలుగులో ట్రెడిషనల్ క్యారెక్టర్లలో చూసిన వాళ్లు ఈ పాత్ర చూశాక షాకవుతారు. ఇంతకుముందు ‘ఆరణ్య కాండం’తో జాతీయ అవార్డు సాధించిన త్యాగరాజన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్ర అనువాద హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు కొన్న ఓ సంస్థ త్వరలోనే తెలుగులో రిలీజ్ చేయబోతోంది. తెలుగులో ఈ చిత్రం ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on February 23, 2021 3:40 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…