Movie News

సుమంత్‌కు ఇది పెద్ద షాకే

ఇబ్బందుల్లో ఉన్న తన కెరీర్‌ను తిరిగి గాడిన పెడుతుందని ‘కపటధారి’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సుమంత్. కానీ ఆ చిత్రం అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. కెరీర్‌ను ఉపునివ్వకపోగా.. ఇంకా దెబ్బ తినేలా చేసేట్లుందీ చిత్రం. ఈ శుక్రవారం విడుదలైన ‘కపటధారి’కి వచ్చిన టాక్, దాని బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుందని విడుదలకు ముందు సుమంత్ ధీమాగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఇది కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కపటధారి’కి రీమేక్.

ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేశారు. తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా ఈ సినిమా తీశారు. అది జనవరి నెలాఖర్లోనే విడుదలైంది. మంచి రివ్యూలు తెచ్చుకుంది. హిట్ కూడా అయింది. దీంతో తెలుగులోనూ సినిమా విజయవంతం కావడం లాంఛనమే అనుకున్నారు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే అనిపించింది.

కానీ ‘కపటధారి’ సినిమా చూసిన జనాలు మాత్రం పెదవి విరుస్తున్నారు. మాతృకను యాజిటీజ్ ఫాలో అయిపోయినా.. అందులోని ఫీల్ ఇందులో లేదు. కథాంశం బాగున్నప్పటికీ థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠ, బిగి, వేగం ఇందులో మిస్సయ్యాయని అంటున్నారు. సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా సుమంత్‌కు లేదు. అతడి సినిమా చాలా బాగుందంటే తప్ప థియేటర్లకు జనాలు రారు. ప్రస్తుతం ప్రేక్షకులకు థియేటర్లలో వేరే ఆప్షన్లు ఉన్నాయి.

ముందు వారం వచ్చిన ‘ఉప్పెన’ ఇప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ వారం సినిమాల్లో ‘నాంది’ మంచి టాక్ తెచ్చుకుంది. వాటికే ప్రేక్షకులు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. విశాల్ సినిమా ‘చక్ర’కు కూడా ఓ మోస్తరుగా స్పందన ఉంది కానీ.. ‘కపటధారి’నే ఈ బాక్సాఫీస్ పోరులో అన్యాయం అయిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలు షాకింగ్‌గా ఉన్నాయి. ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి. స్క్రీన్లు కూడా బాగా తగ్గించేశారు. ‘నాంది’కి పెంచారు. ‘ఉప్పెన’కు తగ్గించిన స్క్రీన్లు మళ్లీ దానికే యాడ్ అయ్యాయి. ఇక బుక్ మై షోలో ‘కపటధారి’ బుకింగ్స్ చూస్తే సినిమా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది.

This post was last modified on February 22, 2021 7:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago