రాజమౌళి పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తుల సినిమాలంటే అన్ని పనులూ వదులుకుని వచ్చి ప్రమోట్ చేస్తుంటాడు. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జక్కన్నకు అలాంటి సన్నిహితుడే. వీళ్లిద్దరి సినీ ప్రస్థానం దాదాపు ఒకేసారి మొదలైంది. ఇద్దరూ కలిసి కొన్నేళ్లు ట్రావెల్ చేశారు. తర్వాత ఇద్దరూ దర్శకులుగా మారారు. ఎవరి స్టయిల్లో వాళ్లు సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
ఐతే రాజమౌళి కమర్షియల్ సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోతే యేలేటి తన స్టయిల్లో విభిన్న సినిమాలు చేస్తూ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. యేలేటి చివరగా తీసిన మనమంతా సినిమా కోసం రాజమౌళి స్పెషల్ ప్రమోషన్లు చేశాడు. యేలేటితో కలిసి టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు తన మిత్రుడి కొత్త సినిమా చెక్‌ను ప్రమోట్ చేయడానికి కూడా రాజమౌళి ముందుకొచ్చాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మంచి మాటలు చెప్పాడు.
లాక్ డౌన్ బ్రేక్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయని, ఐతే ఈ మధ్య కాలంలో ఒక టీజర్ చూసి ఎప్పుడెప్పుడు థియేటరుకెళ్లి సినిమా చూద్దామా అనిపించింది చెక్ విషయంలోనే అని రాజమౌళి చెప్పాడు. టీజర్ అంత ఆసక్తికరంగా, కొత్తగా అనిపించిందని జక్కన్న అభిప్రాయపడ్డాడు. తెలుగులో మాస్, క్లాస్ సినిమాలు అనే తేడాలు తగ్గాయని.. ఐతే చెక్ సినిమాతో ఈ గీత పూర్తిగా చెరిగిపోతుందని తాను నమ్ముతున్నానని రాజమౌళి చెప్పాడు. ఇది క్లాస్ సినిమానే అయినప్పటికీ మాస్ సినిమా స్థాయిలో చాలా బాగా ఆడి ఆ అంతరాన్ని చెరిపేస్తుందని భావిస్తున్నట్లు ఆయనన్నారు.
హీరో నితిన్ ఒకప్పుడు ఒక పరిధిలో ఉండి ఇలాంటి సినిమాలే చేస్తాడు అనే ముద్ర వేసుకున్నాడని.. అలాంటి దశ నుంచి తనను తాను కొత్తగా మలుచుకుని విభిన్నమైన సినిమాలతో ప్రయాణం సాగిస్తున్నాడని.. చెక్ అతడి కెరీర్లో పెద్ద హిట్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నానని జక్కన్న చెప్పాడు.
This post was last modified on February 22, 2021 7:36 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…