ఓటీటీ జెయింట్ నెట్ ఫ్లిక్స్ తెలుగులో ప్రొడ్యూస్ చేసిన తొలి వెబ్ ఫిలిం ‘పిట్టకథలు’. తెలుగులో ఒరిజినల్స్ తీయాలని నెట్ ఫ్లిక్స్ ఎప్పట్నుంచో చూస్తోంది. కానీ ఇంతకుముందు అనుకున్న ప్రాజెక్టులేవీ వర్కవుట్ కాలేదు. హిందీలో నెట్ ఫ్లిక్స్ తీసిన ‘లస్ట్ స్టోరీస్’కు తెలుగు వెర్షన్ చేయడానికి కూడా రెండేళ్ల ముందు సన్నాహాలు మొదలయ్యాయి. కానీ కరోనా వల్ల ఇది కూడా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ ‘పిట్టకథలు’ విడుదలైంది.
ఐతే ముందు నుంచి ఇది ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ అంటుండేసరికి మన ప్రేక్షకులు ఏదో ఊహించుకున్నారు. బోల్డ్ కంటెంట్ చూడబోతున్నామనుకున్నారు. హిందీలో కియారా అద్వానీ ఎపిసోడ్ తరహాలో ఇక్కడ కూడా బోల్డ్ యాక్ట్స్ ఊహించుకున్నారు. కానీ ‘పిట్ట కథలు’ ట్రైలర్ చూస్తే అలాంటి సంకేతాలు కనిపించలేదు. ఒక్క అమలా పాల్ మాత్రమే హాట్‌గా కనిపించింది ఆ టీజర్లో.
ఇప్పుడిక ‘పిట్టకథలు’ చూసిన వాళ్లంతా ‘లస్ట్ స్టోరీస్’కు దీనికి అసలు పోలికే లేదని అంటున్నారు. ఈ యాంథాలజీ ఫిలింలో ఒక్క అమలా పాల్ మాత్రమే బోల్డ్‌గా కనిపించింది. ‘లస్ట్ స్టోరీస్’ టచ్ ఉన్నది ఈ ఎపిసోడ్లో మాత్రమే. కెరీర్ ఆరంభంలో చేసిన ఓ సినిమా మినహాయిస్తే తనకంటూ ఒక ఇమేజ్ వచ్చాక అమల ట్రెడిషనల్‌గానే కనిపిస్తూ వచ్చింది. కానీ పెళ్లయి విడాకులు తీసుకుని సినిమాల్లోకి పునరాగమనం చేశాక మాత్రం ఆమె చాలా బోల్డ్‌గా నటిస్తోంది. తిరుట్టుపయ్యలే-2, ఆమె లాంటి సినిమాల్లో ఆమె ఎంత హాట్‌గా, బోల్డ్‌గా కనిపించిందో తెలిసిందే. ఐతే వాటిని మించి ‘పిట్టకథలు’లోని ‘మీరా’లో హాట్‌గా కనిపించింది అమల.
ఆద్యంతం సెక్సీ లుక్‌తో ఆమె కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఇందులో అందమైన భార్య మీద అనుమానంతో రగిలిపోయే మిడిలేజ్డ్ హజ్బెండ్ పాత్రలో జగపతిబాబు నటించాడు. భార్యతో సన్నిహితంగా కనిపించిన ప్రతి వ్యక్తీ ఆమెతో శృంగారంలో పాల్గొంటున్నట్లు ఊహించుకుంటుందీ పాత్ర. ఈ సన్నివేశాలను నందిని రెడ్డి చాలా బోల్డ్‌గా డీల్ చేసింది. మామూలుగా మన సినిమాల్లో ఇలాంటి సీన్లు పెట్టరు. వెబ్ సిరీస్ అనేసరికి బోల్డ్‌గానే తీశారు. ‘లస్ట్ స్టోరీస్’ దృష్టితో ‘పిట్టకథలు’ చూసిన వాళ్లకు ఈ ఎపిసోడ్ ఒక్కటే సంతృప్తినిస్తోంది. అమల మాత్రమే తమ అంచనాల్ని అందుకుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on February 21, 2021 2:00 pm
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…