సీనియర్ నటి ప్రగతి ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. లాక్ డౌన్ టైంలో ఆమెలోని కొత్త కళలు బయటికి వస్తున్నాయి. ఇటీవల తన కొడుకుతో కలిసి చేసిన మాస్ డ్యాన్స్‌తో ఆమెఇంటర్నెట్లో ఎలా హల్ చల్ చేశారో తెలిసిందే. అలాగే లాక్ డౌన్ టైంలో ఆమె వర్కవుట్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పి సంచలనం రేపారు. ఓ టాలీవుడ్ సీనియర్ కమెడియన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించారు. బాగా పేరున్న ఆ కమెడియన్ అంకతుముందు ఎప్పుడూ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదని.. కానీ ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా మాత్రం రోజు హద్దులు దాటాడని ఆమె వివరించింది.
డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడటంతో పాటు ఇబ్బందికరంగా ప్రవర్తించాడని.. ఆయన ప్రవర్తనకు విసుగెత్తి పోయానని.. దీంతో ఆ రోజు షూటింగ్ ముగిసే వరకు ఎదురు చూసి ఆ తర్వాత ఆయన్ని కారవాన్లోకి తీసుకెళ్లి మాట్లాడానని ప్రగతి వివరించారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఇప్పుడెందుకు ప్రవర్తిస్తున్నారు.. నేనేమైనా తప్పుగా ప్రవర్తించి మీలో ఇలాంటి ఉద్దేశాలు కలిగించానా అని ఆయన్ని ప్రశ్నించానని.. అలాంటిదేమీ లేదని ఆయన అన్నారని.. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దని ఆయనకు చెప్పి బయటికి వచ్చేశానని ప్రగతి చెప్పింది.
ఐతే తాను బయటికి వచ్చాక ఆయన తన గురించి మరో రకంగా ప్రచారం చేశారని.. తనకు చాలా పొగరని వేరే వాళ్ల దగ్గర అన్నాడని ప్రగతి వెల్లడించింది. ఇంతకుమించి తనకు పరిశ్రమలో పెద్దగా చేదు అనుభవాలేమీ లేవని ప్రగతి. దీంతో ఈ సీనియర్ నటిని ఇలా ఇబ్బంది పెట్టిన సీనియర్ కమెడియన్ ఎవరా అన్న చర్చ ఇండస్ట్రీ జనాల్లో మొదలైంది.
This post was last modified on May 10, 2020 8:42 am
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…