సోషల్ మీడియాలో మనం ఏ హావభావాన్ని వ్యక్తం చేయాలన్నా పదాల కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. అందుకోసం కంపోజ్ చేయాల్సిన అవసరమూ లేదు. ప్రతి ఎక్స్‌ప్రెషన్‌కూ తగ్గట్లుగా బ్రహ్మానందం ఫొటోనో, జీఐఎఫ్పో లేదంటే వీడియోనో సిద్ధంగా ఉంటుంది. ఏ సందర్భానికైనా సరిపోయే హావభావాలు తన పాత్రల ద్వారా ఎన్నో ఇచ్చారు బ్రహ్మానందం.
మన వాళ్లకున్న అదృష్టం ఏమో కానీ.. సోషల్ మీడియా జనాలు కేవలం బ్రహ్మానందం హావభావాలతోనే మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఇతర భాషల వాళ్లు సైతం బ్రహ్మి హావభావాలను విపరీతంగా వాడేస్తున్నారు. ఐతే మనకు బ్రహ్మి ఉన్నట్లే ప్రపంచానికి ఇలా వివిధ రకాల హావభావాలను వ్యక్తం చేసేందుకు ఓ వ్యక్తి ఉన్నారు. నిజానికి మనవాళ్లు సైతం అతడి హావభావాలను తెగ వాడేస్తుంటారు. కానీ అతడి పేరేంటో చాలా మందికి తెలియదు.
ఒసితా ఐహీమ్.. ఈ పేరు చెబితే ఎవరో అనుకుంటారు కానీ.. ఆ పేరును గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మనందరికీ బాగానే పరిచయం అనే విషయం అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ‘మీమ్స్’ మొదలైందే ఇతడి చిత్రాలతో. చాలా ఏళ్ల నుంచి అతను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని తన హావభావాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు కానీ..ఒసితా వయసు 39 ఏళ్లు కావడం విశేషం. ఓ అనారోగ్య సమస్య కారణంగా అతడి ఎత్తు 4 అడుగుల 3 అంగుళాల దగ్గర ఆగిపోయింది. ఐతే ఒసితా పాపులర్ కావడానికి అదేమీ అడ్డంకి కాలేదు. ఇంకా చెప్పాలంటే తన బలహీనతే బలంగా మార్చుకున్నాడు. ఫన్నీ వీడియోలతో సూపర్ పాపులర్ అయ్యాడు. నైజీరియాకు చెందిన ఇతను 300 సినిమాల్లో నటించడం విశేషం. అలాగే కొన్ని రకాల వ్యాపారాలు కూడా చేస్తున్నాడు ఒసితా.
మీమ్ క్రియేటర్లకు బోలెడంత కంటెంట్ ఇచ్చిన అతను.. గత కొన్నేళ్లలో భాషా భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ తన పాపులారిటీని విస్తరించాడు. శనివారం ఒసితా పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సెలబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాను గమనిస్తే అతడి పాపులారిటీ ఏంటన్నది అర్థమవుతుంది.
This post was last modified on March 2, 2021 8:15 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…