ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఓ సౌత్ సినిమా పోటీగా నిలిస్తే.. హిందీ సినిమా నిర్మాత గగ్గోలు పెట్టే పరిస్థితి వస్తుందని కొన్నేళ్ల ముందు వరకు ఎవరూ ఊహించి ఉండరు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్న రాజమౌళి తీస్తున్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను దసరా సీజన్లో తన సినిమా ‘మైదాన్’కు పోటీగా నిలిపారని బోనీ కపూర్ ఎంత ఆక్రోశానికి గురయ్యాడో తెలిసిందే. రాజమౌళి రేంజ్ ఎలా పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
కేవలం రాజమౌళి సినిమా అనే కాదు.. ఇప్పుడు సౌత్ సినిమాలంటేనే బాలీవుడ్ భయపడే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగులో ప్రభాస్ ఏ సినిమా చేసినా.. ఇప్పుడు ఉత్తరాదిన వసూళ్ల మోత మోగిస్తోంది. అలాగే తమిళం నుంచి రజినీకాంత్, విజయ్, సూర్య సినిమాలు సౌత్ ఉత్తరాదిన మంచి ప్రభావమే చూపిస్తున్నాయి కొన్నేళ్లుగా. ఇప్పుడు కొత్తగా కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా పోటీ తప్పట్లేదు.
‘కేజీఎఫ్’ సినిమా ఉత్తరాదిన ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్-2’ మీదా నార్త్‌లో భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాకు పోటీగా నిలబడ్డానికి హిందీ సినిమాలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ బెంబేలెత్తిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
ముందుగా జులై 16న ‘కేజీఎఫ్-2’ బరిలోకి దిగుతోంది. దాని దూకుడు కొనసాగుతుండగానే.. ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ వచ్చేస్తుంది. ఆ చిత్రం జులై 30న రిలీజవుతుంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద ఎత్తున రిలీజయ్యే సినిమానే. ఇంకో రెండు వారాల్లోపే ‘పుష్ప’ను రిలీజ్ చేయబోతున్నారు. గత కొన్నేళ్లలో డబ్బింగ్ సినిమాలతోనే అల్లు అర్జున్ ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ‘పుష్ప’తో నార్త్‌లో అతను గట్టి ప్రభావమే చూపిస్తాడని అంచనా వేస్తున్నారు. ఇక దసరా సీజన్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగూ ఉండనే ఉంది. మరోవైపు జులై తొలి వారంలో రానున్న ‘మేజర్’ సినిమా నార్త్ వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే 26/11 దాడుల నేపథ్యంలో తెరకెక్కింది కాబట్టి.. అది కూడా నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రభావమే చూపుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on February 15, 2021 6:58 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…