Movie News

అవును.. షారుఖ్‌తో మళ్లీ నటిస్తున్నా-సల్మాన్


బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య పోటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దల నుంచి వీరి మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. ఇద్దరూ మంచి మిత్రుల్లాగే కనిపిస్తారు కానీ.. వారి అభిమానులకు మాత్రం పరస్పర వ్యతిరేక భావాలున్నాయి. ఒకరి హీరోను ఒకళ్లు టార్గెట్ చేస్తుంటారు. ట్రోల్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో షారుఖ్, సల్మాన్ మధ్య విభేదాలు నెలకొని దూరం దూరంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.

బాలీవుడ్ నంబర్ వన్ కిరీటం కోసం ఒకప్పుడు వీరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. కెరీర్ ఆరంభంలో ‘కరణ్ అర్జున్’తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన ఈ సూపర్ స్టార్లు.. గత దశాబ్ద కాలంలో ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రలు చేశారు. సల్మానే ఎక్కువగా షారుఖ్ చిత్రాల్లో కనిపించడం తెలిసిన సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో షారుఖ్ తన ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయి హిట్టు కోసం నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.

రెండేళ్లకు పైగా విరామం తీసుకుని షారుఖ్ ప్రస్తుతం ‘పఠాన్’ అనే సినిమాలో నటిస్తుండగా.. ఆ చిత్రంలో సల్మాన్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు ఇంతకుముందే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయం అధికారికంగా వెల్లడైంది. ‘పఠాన్’లో తాను ఓ కీలక పాత్ర చేయనున్నట్లు, త్వరలోనే ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సల్మాన్ వెల్లడించాడు. తాజాగా తాను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోలో సల్మాన్ ఈ విషయం తెలిపాడు.

బిగ్ బాస్ కొత్త సీజన్ పూర్తయ్యాక తాను నటించబోయే తొలి చిత్రం ‘పఠాన్’యే అని అతను వెల్లడించాడు. దీంతో పాటు ‘టైగర్-3’లోనూ నటిస్తానన్నాడు. ఈ చిత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో మనీశ్ శర్మ ద్శకత్వంలో తెరకెక్కనుంది. దాని తర్వాత రైటర్ టర్న్డ్ డైరెక్టర్ ఫర్హద్ సామ్‌జీ డైరెక్షన్లో ‘కబీ ఈద్ కబీ దివాలి’లో సల్మాన్ నటించబోతున్నాడు. ఈ మూడు చిత్రాలూ పూర్తి చేసి వచ్చే ఏడాది మళ్లీ బిగ్ బాస్ కొత్త సీజన్‌కు వస్తానని సల్మాన్ ఖాన్ వెల్లడించాడు. సల్మాన్ ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో రాధె చిత్రాన్ని పూర్తి చేయగా అది రంజాన్ కానుకగా విడుదల కానుంది.

This post was last modified on February 15, 2021 2:01 pm

Share
Show comments

Recent Posts

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

43 minutes ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

2 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

2 hours ago

ఇక్కడ 13 వేల కోట్ల స్కాం.. అక్కడ ఆమ్మాయికి దొరికేశాడు

భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…

2 hours ago

సాయిరెడ్డి సీటు ఎవ‌రికిస్తారు బాబూ?

తాజాగా మ‌రో రాజ్య‌స‌భ సీటుకు సంబంధించి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. వైసీపీ నాయ‌కుడు, కీల‌క నేత‌ల వేణుంబాకం విజ‌య‌…

3 hours ago