నందమూరి కళ్యాణ్ రామ్ వెండితెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. గత ఏడాది సంక్రాంతికి ఎంత మంచివాడవురా సినిమాతో పలకరించాడతను. కొన్నేళ్ల పరాజయ పరంపరకు తెరదించుతూ 118తో మళ్లీ ఫామ్ అందుకున్న అతడికి ఎంత మంచివాడవురా పెద్ద షాకే ఇచ్చింది. కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పండుగ టైంలో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకోకపోవడం పెద్ద షాక్. ఆ షాక్ నుంచి కోలుకుని ఇంకో సినిమాను పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్.
మధ్యలో అతను హీరోగా కొత్త సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. చివరగా మలయాళ థ్రిల్లర్ అంజామ్ పత్తిర రీమేక్‌లో నందమూరి హీరో నటించబోతున్నాడని గట్టి ప్రచారమే సాగింది. కానీ దాని సంగతి ఏమైందో తెలియదు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమా కబురు బయటికొచ్చింది.
ఏజెంట్ వినోద్ అనే వింటేజ్ టచ్ ఉన్న థ్రిల్లర్ మూవీలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడన్నది తాజా సమాచారం. ఇందులో నందమూరి హీరో డిటెక్టివ్ పాత్రను పోషించబోతున్నాడట. ఇంతకుముందు అవసరాల శ్రీనివాస్ హీరోగా బాబు బాగా బిజీ అనే అడల్డ్ కామెడీని డైరెక్ట్ చేసిన నవీన్ మేడారం ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట.
తొలి సినిమా రీమేక్ కావడం, అది ఫ్లాప్ కావడంతో నవీన్ ప్రతిభేంటో ఎవరికీ తెలియలేదు. ఐతే అతను అదిరిపోయే థ్రిల్లర్ కథతో కళ్యాణ్ రామ్‌ను ఇంప్రెస్ చేసినట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని అతను సొంత బేనర్లోనే నిర్మించబోతున్నట్లు కూడా చెబుతున్నారు. 1940 నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. పెద్ద బడ్జెట్లోనే సినిమా తీయబోతున్నారట. కళ్యాణ్ రామ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.
This post was last modified on February 13, 2021 10:29 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…