టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకడు. 20 ఏళ్ల నుంచి ఆయన ఘన ప్రస్థానం కొనసాగుతోంది. తెలుగులో ఎంతోమంది హీరోలను ఆయన పరిచయం చేశాడు. ఎంతోమంది హీరోలను తన సినిమాల ద్వారా స్టార్లను చేశాడు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి కూడా ఒక హీరో రాబోతుండటం విశేషం. ఆ కుర్రాడి పేరు.. ఆశిష్ రెడ్డి.
దిల్ రాజుకు ఇతను కొడుకు కాదు కానీ, కొడుకు లాంటి వాడే. రాజు తమ్ముడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో రాజు తర్వాత అంత కీలకం అయిన శిరీష్ రెడ్డి తనయుడే ఆశిష్ రెడ్డి. ఈ కుర్రాడిని హీరోగా పరిచయం చేయడం కోసం కొన్నేళ్ల ముందు నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. హీరో కావడం కోసం అన్ని రకాలుగా అతను సన్నద్ధమయ్యాడు. ఎట్టకేలకు అతడి లాంచింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆశిష్ తొలి సినిమా ఇప్పటికే చిత్రీకరణ దశలోనూ ఉంది.
రాజు మిత్రుడు, ఆయన నిర్మాణ భాగస్వామి కూడా అయిన బెక్కెం వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం చేసిన శ్రీ హర్ష దర్శకత్వంలో ఆశిష్ తొలి చిత్రం తెరకెక్కుతోంది. ‘హుషారు’ సినిమాతో శ్రీ హర్ష మంచి పేరే సంపాదించాడు. యూత్ ఫుల్ సినిమాలను బాగా డీల్ చేయగలడని పేరు తెచ్చుకున్నాడు. అతణ్నే ఆశిష్ సినిమా లాంచింగ్‌కు ఎంచుకున్నారు.
ఈ చిత్రానికి పెద్ద పెద్ద టెక్నీషియన్లనే పెట్టుకున్నాడు రాజు. అగ్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దీనికి స్వరాలు సమకూరుస్తుండగా.. శ్రీమంతుడు, సాహో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన మధి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నాడు. ప్రేమదేశం, హ్యాపీడేస్ సినిమా కలయికలా ఈ చిత్రం ఉంటుందని ఈ సినిమా గురించి ఓ మీడియా సంస్థతో శిరీష్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఆశిష్ ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారట.
This post was last modified on February 11, 2021 10:04 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…