నిర్మాతగా మారాక.. నటనపై దృష్టి తగ్గించాడు బండ్ల గణేష్. అక్కడా కొన్ని దెబ్బలు పడ్డాక – రాజకీయాలవైపు మళ్లాడు. తిరిగి.. ‘సరిలేరు నీకెవ్వరు’తో మేకప్ వేసుకున్నాడు.
మహేష్ సినిమా కాబట్టి, ‘సరిలేరుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు నటుడిగా రీ ఎంట్రీ అవుతుందని భావించాడు. అయితే.. ఆ సినిమా తనకు ప్లస్ గా మారలేదు సరికదా, మైనస్ అయిపోయింది. తన పాత్ర ముందు చెప్పినట్టు లేదని, ఎడిటింగ్ లో లేచిపోయిందని ఆ తరవాత వాపోయాడు. ఇలాంటి పాత్రలు చేయకూడదని గట్టిగా ఫిక్సయ్యాడు.
ఇప్పుడు గణేష్ రీ.. రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మారుతి సినిమాతో. గోపీచంద్ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మారుతికి ఓ పాత్ర దక్కింది.
నిజానికి మారుతి గత సినిమా ‘ప్రతిరోజూ పండగే’ లో బండ్లకి ఓ పాత్ర దక్కాల్సింది. కానీ కుదర్లేదు. ఈసారి మాత్రం బండ్లకు ఓ మంచి పాత్రే రాశాడట గణేష్. ఈ సినిమాతో నటుడిగా తనకు మంచి బ్రేక్ వస్తుందని ఫీలవుతున్నాడు బండ్ల. మరి ఈ రీ.. రీ.. ఎంట్రీ ఏమవ్వబోతోందో?
This post was last modified on February 9, 2021 3:00 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…