రెండున్నరేళ్ల కిందట తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మంచి ఫలితాన్నందుకోలేదు కానీ.. తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త దర్శకుడు వెంకటేష్ మహా వైజాగ్ శివార్లలోని కంచరపాలేనికి వెళ్లి అక్కడే ఆర్నెల్లు గడిపి అక్కడి మనుషులు, వారి మనస్తత్వాల్ని గమనించి.. అక్కడి వాళ్లనే ప్రధాన పాత్రలకు ఎంచుకుని అద్భుతమైన సినిమాను అందించాడు. ఈ చిత్రం కొన్ని అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
ఇప్పుడీ సినిమా తమిళ ప్రేక్షకులనూ పలకరించబోతోంది రీమేక్ రూపంలో. తెలుగువాడే అయిన జాస్తి హేమాంబర్ అనే దర్శకుడు తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు. కేరాఫ్ కాదల్ పేరుతో తెరకెక్కిందీ చిత్రం. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ సైతం తెలుగు వెర్షన్‌తో పోలిస్తే డిట్టోలా అనిపిస్తోంది. రాజు పాత్రధారి పెళ్లి గురించి ఊరంతా చర్చించుకోవడం.. ప్రతి ఒక్కడికీ నా పెళ్లితోనేే పని అనడం.. ఇలాగే మొదలైంది ‘కేరాఫ్ కాదల్’ ట్రైలర్. తెలుగు వెర్షన్‌తో పోలిస్తే తమిళంలో ఏ చిన్న మార్పూ చేయలేదని స్పష్టమవుతోంది. తెలుగులో నటించిన ఇద్దరు నటులు తమిళంలోనూ అవే పాత్రల్ని పోషించడం విశేషం. తెలుగులో జోసెఫ్ పాత్ర చేసిన కార్తీక్ రత్నం, అలాగే మూగ ఆర్టిస్టుగా చేసిన నటుడు తమిళంలోనూ చేశారు.
ఐతే మాతృకను యాజిటీజ్ దించేసినప్పటికీ.. సోల్ మిస్ కాకుండా చూసుకున్నట్లే ఉన్నారు. ఈ చిత్రాన్ని వారం ముందే మీడియా వాళ్లకు ప్రివ్యూ షో వేయగా.. చూసిన వాళ్లందరూ సినిమా చాలా బాగుందనే అంటున్నారు. పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ‘సంక్రాంతి సినిమాల తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయిన సమయంలో వస్తున్న ‘కేరాఫ్ కాదల్ మంచి ఫలితమే అందుకుంటుందని భావిస్తున్నారు.
This post was last modified on February 9, 2021 2:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…