Movie News

మెగా హీరోను సొంత తమ్ముడిలా చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్

మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న హీరో వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవికి చిన్న మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌కు తమ్ముడు అయిన వైష్ణవ్.. మిగతా కుర్రాళ్లలా అరంగేట్ర సినిమాకు యాక్షన్ బాట పట్టలేదు. హీరోయిజం, ఎలివేషన్ల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఒక మంచి ప్రేమకథలో, డీగ్లామరస్ రోల్‌లో నటించే సాహసానికి పూనుకున్నాడు. అది మంచి ఫలితమే అందించేలా కనిపిస్తోంది.

‘ఉప్పెన’ టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలు చూస్తే పెర్ఫామెన్స్ పరంగా వైష్ణవ్‌కు మంచి స్కోపే లభించినట్లు కనిపిస్తోంది. మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు, సుక్కు, విజయ్ సేతుపతి తదితరులు వైష్ణవ్ పెర్ఫామెన్స్ గురించి, కళ్లతో అతను పలికించిన భావాల గురించి గొప్పగానే మాట్లాడారు. ఇక సినిమా మొత్తం చూసిన మెగాస్టార్ చిరంజీవి.. తనకు పెద్ద కాంప్లిమెంటే ఇచ్చినట్లు వైష్ణవ్ తాజాగా వెల్లడించాడు.

‘ఉప్పెన’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన అతను.. సినిమా చూశాక చిరు స్పందన గురించి గుర్తు చేసుకున్నాడు. సినిమా చూశాక తన మావయ్య ఏమంటాడా అని ఉత్కంఠగా ఎదురు చూశానని.. ‘‘సూపర్‌‌గా చేశావ్‌ రా. నా పరువు నిలబెట్టావ్ రా’’ అని ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడని వైష్ణవ్ వెల్లడించాడు. తన జీవితంలో ఇదే అది పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తానని వైష్ణవ్ తెలిపాడు. చిరుకు సినిమా ఎంతగానో నచ్చిందని, ప్రేక్షకులకు కూడా అలాగే నచ్చుతుందని ఆశిస్తున్నట్లు అతను చెప్పాడు. తన చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ ‘ఉప్పెన’ ట్రైలర్ మాత్రమే చూశారని, సినిమా చూడలేదని.. ట్రైలర్ చాలా బాగుందని, అందులో డైలాగులు భలే ఉన్నాయని కితాబిచ్చాడని వైష్ణవ్ వెల్లడించాడు.

‘ఉప్పెన’ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సహకారం కూడా మరిచిపోలేనిదని.. రామ్ చరణ్ ఇంట్లో ఆయన్ని కలిశానని, అప్పట్నుంచి తనను సొంత సోదరుడి లాగా చూశాడని, తరచుగా ఫోన్ చేసి సినిమా ఎలా వస్తోందో అడిగి, విలువైన సలహాలు ఇచ్చాడని, ‘ఉప్పెన’ ట్రైలర్ కూడా లాంచ్ చేసి తనకు సపోర్ట్ చేశాడని వైష్ణవ్ తెలిపాడు. మంచు మనోజ్ సైతం తనకు అండగా నిలిచాడని, ఆయనకు రుణపడి ఉంటానని వైష్ణవ్ చెప్పాడు.

This post was last modified on February 9, 2021 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago