Movie News

ఇక్కడ పవన్-రానా.. అక్కడ వాళ్లు

సరిగ్గా ఏడాది కిందట మలయాళంలో పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఓ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. లాక్ డౌన్ టైంలో భాషా భేదం లేకుండా ఆ సినిమాను విరగబడి చూశారు ప్రేక్షకులు. ఇప్పుడా సినిమా మూడు ప్రధాన భాషల్లో రీమేక్ కూడా అవుతోంది. ఆ సినిమానే.. అయ్యప్పనుం కోషీయుం.

పృథ్వీ రాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సాచి రూపొందించిన ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల మొదలైన చిన్న గొడవ ఇగో క్లాష్ కారణంగా ఏ స్థాయికి వెళ్లిందనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ కథానాయకుడు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ రీమేక్ కూడా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసే నటులు కూడా ఖరారైనట్లు సమాచారం.

‘అయ్యప్పనుం కోషీయుం’ హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నాడు. అతను ఇందులో నటించబోతున్నాడు కూడా. ఒరిజినల్లో బిజు చేసిన పాత్రను జాన్ చేయనున్నాడట. పృథ్వీ రాజ్ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్‌ను అడుగుతున్నారట. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారవ్వలేదు. తన టీంతో స్క్రిప్టును హిందీకి అనుగుణంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు జాన్ అబ్రహాం. అభిషేక్‌కు ఈ సినిమాలో నటించడానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోవచ్చు.

జాన్, అభిషేక్ కలిసి ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించారు. అందులో ఒకటి.. ధూమ్. అదెంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ తర్వాత వీళ్లిద్దరూ ‘దోస్తానా’లో నటించారు. అది కూడా బాగానే ఆడింది. ఇప్పుడు మూడోసారి వీళ్లిద్దరూ జోడీ కట్టబోతున్నారు. త్వరలోనే ‘అయ్ప్పనుం కోషీయుం’ హిందీ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనుందట. తమిళంలోనూ ఈ ఏడాదే దీని రీమేక్ మొదలయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on February 7, 2021 5:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago