అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కొత్త సినిమా ‘నాంది’. తన మార్కు కామెడీకి ఎప్పుడో కాలం చెల్లిపోవడంతో నరేష్ చాలా ఏళ్ల నుంచి ఫ్లాపుల మీద ఫ్లాపులు కొడుతున్నాడు. అతడి నుంచి కనీస స్థాయిలో మెప్పించే సినిమా కూడా రావట్లేదు. తాజాగా ‘బంగారు బుల్లోడు’తో అతను మరో ఎదురు దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజైన సంగతి కూడా జనాలు పట్టించుకోని పరిస్థితి.
ఐతే నరేష్ నటించిన మరో సినిమా ‘నాంది’ మీద మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. తన శైలికి భిన్నంగా నరేష్ ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామాలో నటించడంతో ముందు నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఇంతకుముందు రిలీజైన టీజర్ మాదిరే ‘నాంది’ ట్రైలర్ కూడా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా సాగింది. నరేష్ ఇందులో చాలా కొత్తగా కనిపించాడు.
చేయని నేరానికి ఒక అమాయకుడు జైలు పాలైతే, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించి మరింతగా కేసులో ఇరికిస్తే, జైల్లో చిత్ర హింసలకు గురి చేసి నేరం ఒప్పుకునేలా చేస్తే అతడి పరిస్థితి ఏంటి.. ఈ సుడిగుండం నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్న నేపథ్యంలో సాగే సినిమా ‘నాంది’. ఎప్పుడూ కామెడీ పాత్రల్లో నరేష్‌ను చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు ఇందులో అతను సరికొత్తగా కనిపించాడు. ట్రైలర్ ఆద్యంతం అతను ఆకట్టుుకన్నాడు. సినిమా ఆద్యంతం సీరియస్ నోట్‌లో సాగుతుందని అర్థమైంది.
ఐతే నరేష్ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు, అతణ్ని ఇలాంటి పాత్రలో చూడటం భిన్నంగా అనిపించింది కానీ.. ‘నాంది’ కథ అయితే కొత్తగా ఏమీ లేదు. ఇలా చేయని నేరానికి హీరో జైలు పాలవడం, పోరాడి బయటికి వచ్చే నేపథ్యంలో సినిమాలు చాలా ఏళ్ల కిందటే వచ్చాయి. ట్రైలర్ చూస్తే ‘నాంది’ కథపై మొదట్నుంచి చివరిదాకా ఒక అంచనా వచ్చేస్తోంది. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏమీ కనిపించడం లేదు. ముందు హీరో హత్య కేసులో చిక్కుకోవడం, అతడికి అన్నీ ప్రతికూలంగా మారడం, జైల్లో చిత్ర హింసలు అనుభవించడం.. తర్వాత అతను తిరగబడడం, కేసు నుంచి బయటపడటం.. ఇలా సినిమా ఎలా నడుస్తుందన్న దానిపై ముందే ఒక అంచనా వచ్చేస్తోంది. సినిమాలో ఇంతకుమించి ఏదైనా కొత్తగా చూపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తేనే వాళ్లు సంతృప్తి చెందుతారన్నది వాస్తవం. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాను ఫిబ్రవరి 19న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
This post was last modified on %s = human-readable time difference 4:12 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…