కన్నడ సినిమా సినిమా చరిత్రలో ఎన్నడూ లేనిది, ఎవ్వరూ ఊహించనిది జరిగింది రెండేళ్ల కిందట. ఉపేంద్ర హీరోగా నటించిన కొన్ని తప్పితే కన్నడ సినిమాలు వేరే భాషల్లో కనీస ప్రభావం చూపేవి కావు. అసలు అవి వేరే భాషల్లో రిలీజవడమే గగనం. అలాంటిది ‘కేజీఎఫ్’ వివిధ భాషల్లో ప్రకంపనలు రేపే విజయం సాధించింది. ‘బాహుబలి’ తర్వాత ఓ సౌత్ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో ఈ స్థాయి క్రేజ్ రావడం ‘కేజీఎఫ్’ విషయంలోనే చూస్తున్నాం. ఇటీవల రిలీజైన ‘కేజీఎఫ్-2’ టీజర్.. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
ఐతే సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండేసరికి నిర్మాతల ఆశ కూడా పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. సినిమా మొదలుపెట్టే సమయానికి వాళ్లు అంచనా వేసుకున్న దానికి మించి కొన్ని రెట్లు బిజినెస్ జరుగుతోంది ఈ సినిమాకు. అనూహ్యమైన లాభాలు అందుకోబోతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌లకు కూడా ఇందులో వాటా దక్కుతోంది. ‘బాహుబలి’ విషయంలోనూ ఇలాగే జరిగింది కానీ.. ఆ సినిమా మేకింగ్ కోసం భారీగా ఖర్చయింది. దాంతో పోలిస్తే ‘కేజీఎఫ్’ బడ్జెట్ తక్కువే. అందుకుంటున్న లాభాల శాతం ‘బాహుబలి’ కంటే ఎక్కువే ఉంటుందని అంచనా.
ఐతే ఇంత మంచి జరుగుతున్నపుడు సంతృప్తి చెందకుండా కేజీఎఫ్ మేకర్స్ దురాశకు వెళ్తున్నారనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘కేజీఎఫ్-2’కు చెబుతున్న రేట్లు చూసి బయ్యర్లు బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు ఏకంగా రూ.70 కోట్ల రేటు చెప్పినట్లు వార్తలొచ్చాయి. అంటే దాదాపు ‘2.0’ రేట్ అన్నమాట. తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు ఆ రేటు పలుకుతుంటుంది. ‘కేజీఎఫ్-2’పై ఎంత అంచనాలున్నప్పటికీ ఇది మరీ ఎక్కువ రేటన్నది స్పష్టం. ‘కేజీఎఫ్-1’తో పోలిస్తే పదింతట రేటు అడగడం అన్యాయం కాక మరేంటి?
మరోవైపు ‘కేజీఎఫ్’ ఓవర్సీస్ హక్కులకు ఏకంగా రూ.80 కోట్లు కోట్ చేస్తున్నారు. ‘బాహుబలి-2’కు సైతం నిర్మాతలు ఇంత రేటు చెప్పలేదు. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ అంత ధర చెప్పలేదు. అసలే కోవిడ్ కారణంగా ఓవర్సీస్ మార్కెట్ బాగా దెబ్బ తింది. చాలా దేశాల్లో ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు నడవట్లేదు, మన సినిమాలు నడవట్లేదు. ఇలాంటి సమయంలో అంత రేటు చెప్పడం దురాశ కాక మరేంటి అంటూ ట్రేడ్ పండిట్లు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on February 6, 2021 2:57 pm
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…