రీమేక్ .. రీమేక్ అనుకుంటాం గానీ, దాని కష్టాలు దానివే. ఉన్నది ఉన్నట్టు తీస్తే… కాపీ పేస్ట్ అంటారు. మార్పులూ చేర్పులూ చేసి, తేడా కొడితే చెడగొట్టేశామన్న నింద తప్పదు. అందుకే.. రీమేక్ విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. కొన్ని సినిమాలైతే మార్పులు చేయకపోవడమే మంచిది. అప్పప్పయుమ్ కోషియమ్
అలాంటి కథే. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఇది. తెలుగులో పవన్ – రానా కాంబినేషన్‌లో రూపొందిస్తున్నారు.
సాగర్ చంద్ర దర్శకుడే అయినా.. తెర వెనుక, మాత్రం – త్రివిక్రమ్ హస్తమే ఎక్కువ. స్క్రీన్ ప్లే, మాటలూ అంటూ సింహభాగం ఆయనే సినిమాని నడిపిస్తున్నారు.
త్రివిక్రమ్ చేయి పడితే ఏముంది? కొత్త కొత్త మార్పులు పుట్టాల్సిందే. త్రివిక్రమ్ డైలాగ్స్ అంటే ఫన్, ఎంటర్‌టైన్మెంట్ ఆశిస్తారు. అందుకే.. అది కూడా ఈ కథలో మిక్స్ చేసేశారు. పోలీస్ స్టేషన్‌లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ.. లాంటి బ్యాచ్‌ని పెట్టి, వాళ్ల నుంచి వినోదం పిండే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అంతేకాదు.. పవన్ కల్యాణ్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ జోడించార్ట. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అయ్యప్పయుమ్
.. ఓ సీరియస్ సబ్జెక్ట్. ఈగో క్లాష్. అందులో ఫన్ ని మిక్స్ చేసే ప్రయత్నం, పవన్ పాత్రని పెంచేయడం కచ్చితంగా ఇబ్బంది కలిగించే విషయాలే.
త్రివిక్రమ్ తన మార్క్ చూపించడం కోసమో, పవన్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని ఆ పాత్ర నిడివి పెంచడమో చేస్తే.. కథ సైడ్ ట్రాక్ పట్టే ప్రమాదం ఉంది. త్రివిక్రమ్ ఈ సినిమాకి ప్లస్ అవ్వాలి తప్ప, మైనస్ గా మారకూడదు. అదే జరిగితే.. ఓ సూపర్ హిట్ కథని చేచేతులా పాడు చేసుకోవడమే అవుతుంది.
This post was last modified on February 6, 2021 5:06 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్‌లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…