మళ్లీ ఓ శుక్రవారం వచ్చేసింది. కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తోంది. ఈ వారం ఓ విభిన్నమైన సినిమా థియేటర్లలోకి దిగుతోంది. అదే.. జాంబి రెడ్డి. ‘అ!’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్‌తో ‘కల్కి’ తీసిన ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రమిది. హాలీవుడ్లో బాగా పాపులర్ అయిన జాంబీ జానర్‌ను టాలీవుడ్‌లోకి తీసుకొచ్చే సాహసం చేశాడీ చిత్రంతో ప్రశాంత్. ఇండియాలోనే ఈ జానర్లో చాలా తక్కువ సినిమాలు తెరకెక్కగా.. తెలుగులో అసలు జాంబీలతో పూర్తి స్థాయి సినిమా ఇప్పటిదాకా రాలేదు.
ఐతే ప్రయోగాలంటే ఆసక్తి చూపించే ప్రశాంత్.. జాంబీ జానర్‌ను రాయలసీమ ఫ్యాక్షనిజానికి ముడి పెట్టి ఈ సాహసోపేత చిత్రాన్ని తెరకెక్కించాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ‘ఓ బేబీ’తో రీఎంట్రీ ఇచ్చిన తేజ ఈ చిత్రంతోనే హీరోగా పరిచయమవుతున్నాడు. దక్ష నగార్కర్, ఆనంది హీరోయిన్లుగా నటించారు.
సంక్రాంతి సందడి తర్వాత గత రెండు వారాల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయిన సమయంలో ‘జాంబి రెడ్డి’ విడుదలవుతోంది. ‘జాంబి రెడ్డి’ మీద ప్రేక్షకుల్లో ఓ మోస్తరుగా ఆసక్తి కనిపిస్తోంది. బుకింగ్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఐతే సినిమాకు స్టార్ పవర్ లేదు. ప్రశాంత్ ట్రాక్ రికార్డు మరీ గొప్పగా ఏమీ లేదు. కొత్త కాన్సెప్ట్ ఆకర్షిస్తున్నప్పటికీ.. జాంబీ సన్నివేశాల్ని మనవాళ్లు ఏ మాత్రం జీర్ణించుకుంటారన్నది ప్రశ్న.
ట్రైలర్ మరీ గోల గోలగా, కొంచెం ఎబ్బెట్టుగా ఉండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఐతే సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగానే వర్కవుటైనట్లు కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాల జోరు తగ్గిపోవడం, ఈ వారం చెప్పుకోదగ్గ వేరే సినిమాలేవీ లేకపోవడంతో ‘జాంబిరెడ్డి’కి థియేటర్లయితే పెద్ద సంఖ్యలోనే దక్కాయి. ఈ నేపథ్యంలో సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నది కీలకం. ఓపెనింగ్స్ ఎలా ఉన్నా టాక్ బాగుంటే సినిమా బాగానే ఆడేయొచ్చు.
This post was last modified on February 5, 2021 11:36 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…