Movie News

టీజర్ టాక్: హీరో కళ్యాణమండపం నడిపితే..

‘రాజావారు రాణివారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమైన కుర్రాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా ఉన్నంతలో బాగానే ఆడింది. కిరణ్‌కు మంచి పేరు తెచ్చింది. ఏ బ్యాగ్రౌండ్ లేకపోయినా కిరణ్‌కు కొత్తగా రెండు పేరున్న సినిమాల్లో అవకాశం దక్కింంటే అతడి టాలెంట్‌ను టాలీవుడ్ గుర్తించినట్లే ఉంది.

తొలి సినిమా తర్వాత అతను కమిటైన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. దీని టైటిల్, ఫస్ట్ లుక్, ఓ పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ టీజర్ వదిలారు. రాయలసీమ నేపథ్యంలో బాగానే వినోదం దట్టించినట్లే ఉంది ఈ టీజర్ చూస్తుంటే. రాయలసీమకే చెందిన కిరణ్.. భాష, యాసతో పాటు అక్కడి కుర్రాళ్ల యాటిట్యూడ్‌ను బాగానే తెరపైకి తీసుకొచ్చాడు. చేసింది ఒక్క సినిమానే అయినా ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ టీజర్లో ప్రతి షాట్‌లోనూ అతను చూపించిన కాన్ఫిడెన్స్ ఆశ్చర్యపరిచేలా ఉంది.

టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో ఎప్పుడూ చూసే హీరో పాత్రల మాదిరే ఉంది ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో హీరో పాత్ర. ఇంట్లో తల్లిదండ్రులతో తిట్లు తింటూ, అల్లరి చిల్లరిగా తిరుగుతూ, కాలేజీలో బ్యాక్ బెంచ్‌కు పరిమితమైన పాత్ర హీరోది. ఇలా ఉంటూనే హీరోయిన్ వెంట పడటం, ఆమెతో ప్రేమాయణం నడపడం మామూలే. చాలా వరకు రొటీన్ అనిపిస్తూనే ఫన్నీగా సాగిపోయింది టీజర్. అల్లరి చిల్లరిగా తిరిగే హీరో ఉన్నట్లుండి బాధ్యత నెత్తికెత్తుకుని తన స్నేహితులతో కలిసి ఒక కళ్యాణమండపాన్ని నడపాలని నిర్ణయించుకుంటే అతడికి ఎదురైన పరిస్థితులేంటన్న నేపథ్యంలో కథ నడుస్తుంది. హీరోయిజానికి కూడా మంచి స్కోప్ ఉన్నట్లే కనిపిస్తోంది టీజర్ చూస్తే.

‘ట్యాక్సీవాలా’ భామ ప్రియాంక జవాల్కర్ టీజర్లో అందంగా కనిపించగా.. హీరో తండ్రి పాత్రలో సాయికుమార్ బాగా హైలైట్ అయ్యాడు. సీమ యాసలో ఆయన డైలాగులు భలేగా పేలాయి. శ్రీధర్ గాదె అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతాన్నందించాడు. టీజర్‌తో అంచనాలు రేకెత్తించిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on February 4, 2021 3:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago