ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందంటూ సినీ జనాలు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ వారం ‘జాంబి రెడ్డి’ సహా కొత్త సినిమాలు కొన్ని రిలీజవుతున్న నేపథ్యంలో టికెట్లు బుక్ చేద్దామని చూస్తున్న ప్రేక్షకులకు ‘బుక్ మై షో’ సహా టికెటింగ్ వెబ్ సైట్లలో ఆక్యుపెన్సీ 50 శాతమే చూపిస్తున్నాయి. సగం సీట్లను బ్లాక్ చేసి ఉంచారు. ఆల్టర్నేట్ సీట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి కేంద్రం ఆదేశాలు ఇంకా ఎందుకు అమలు కావట్లేదని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా 50 పర్సంట్ ఆక్యుపెన్సీనే అమల్లో ఉంది. కేంద్రం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు ఇందుకు అనుగుణంగా జీవోలు పాస్ చేయకపోవడమే ఇందుక్కారణం.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్‌నే కొనసాగిస్తున్నారు. దక్షిణాదిన ఒక్క తమిళనాడు మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేసింది. నార్త్‌లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాయి. మిగతా రాష్ట్రాలన్నింట్లోనూ 50 శాతంతోనే థియేటర్లు నడుస్తున్నాయి.
కర్ణాటకలో ఈ నెల చివరి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్‌లో ఈ నెల 8 వరకు 50 శాతం కొనసాగేలా మార్గదర్శకాలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు జారీ చేయడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఐతే ఈ శుక్రవారం లోపు ఆదేశాలు వస్తే ‘జాంబి రెడ్డి’ లాంటి కొత్త సినిమాలకు కలిసొస్తుంది. థియేటర్లపై మెయింటైనెన్స్ భారం తగ్గుతుంది.
This post was last modified on February 3, 2021 2:14 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…