Movie News

ఛ‌లోకు మూడేళ్లు హీరో అలా.. ద‌ర్శ‌కుడు ఇలా


మూడేళ్ల కింద‌ట పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిన్న సినిమా ఛ‌లో. అప్ప‌టిదాకా చిన్న స్థాయిలో ఉన్న నాగ‌శౌర్య ఈ సినిమాలో పెద్ద విజ‌యాన్నందుకుని ఫాలోయింగ్, మార్కెట్ పెంచుకున్నాడు. ఇది అత‌డి సొంత నిర్మాణ సంస్థ‌లో తెర‌కెక్కిన తొలి చిత్రం కావ‌డం విశేషం.

ప్ర‌స్తుతం తెలుగులో పెద్ద స్టార్‌గా ఎదిగిన ర‌ష్మిక మంద‌న్నాకు తెలుగులో అరంగేట్ర చిత్రం ఇదే. అలాగే ద‌ర్శ‌కుడిగా మంచి స్థాయిని అందుకున్న వెంకీ కుడుముల‌కు కూడా ఇదే తొలి సినిమా. ఇలా చాలామంది జీవితాల‌ను మార్చేసింది ఛ‌లో. అంత ప్ర‌త్యేక‌మైన చిత్రానికి మూడేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో చిత్ర బృందంలోని ముగ్గురు కీల‌క వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో స్పందించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


ముందుగా ర‌ష్మిక ఈ సినిమా ఆన్ లొకేష‌న్ ఫొటోలు పెట్టి ఎమోష‌న‌ల్‌గా ఒక ఫొటో పెట్టింది. అందులో ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు వెంకీతో పాటు తాను హైలైట్ అయ్యేలా చూసింది. నాగ‌శౌర్య ఒక ఫొటోలో నామ‌మాత్రంగా క‌నిపించాడు. వెంకీ దీనికి స్పందిస్తూ ర‌ష్మిక పెద్ద హీరోయిన్ అవుతుంద‌న్న త‌న అంచ‌నా నిజ‌మైందంటూ ఒక ఫొటోను షేర్ చేశాడు. అత‌ను ఈ రిప్లైలో కానీ, వేరుగా ఛ‌లో మూడో వార్షికోత్స‌వం గురించి పెట్టిన పోస్టులో కానీ నాగ‌శౌర్య పేరే ప్ర‌స్తావించ‌లేదు.

మ‌రోవైపు నాగ‌శౌర్య ఏమో ఈ సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌యమైన త‌న త‌ల్లి గురించి ఒక పోస్టు పెట్టాడు. అంతే త‌ప్ప ద‌ర్శ‌కుడు వెంకీ ప్ర‌స్తావ‌న తేలేదు. ర‌ష్మిక ఊసూ ఎత్తలేదు. ఛ‌లో రిలీజ్ త‌ర్వాత వెంకీకి, నాగ‌శౌర్య‌కు తీవ్ర విభేదాలు త‌లెత్త‌డం.. ముఖ్యంగా శౌర్య వెంకీని టార్గెట్ చేయ‌డం.. తాము బ‌హుమ‌తిగా ఇచ్చిన కారును వెంకీ వాడ‌లేదంటూ అత‌ణ్ని త‌క్కువ చేసి మాట్లాడ్డం.. ఆ త‌ర్వాత వెంకీ వివ‌ర‌ణ ఇవ్వ‌డం తెలిసిందే. అప్పుడు మొద‌లైన గ్యాప్ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంద‌ని, ఇప్పుడు ఇంకా పెరిగింద‌ని తాజా సోష‌ల్ మీడియా పోస్టులను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. చూస్తుంటే ర‌ష్మిక‌కు, శౌర్య‌కు మ‌ధ్య కూడా స‌త్సంబంధాలు లేవ‌ని అర్థ‌మ‌వుతోంది.

This post was last modified on February 3, 2021 11:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

48 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago