అక్కినేని అఖిల్ కెరీర్ ఇలా అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. మిగతా వారసుల్లాగా నాగచైతన్య మాస్ ఇమేజ్ తెచ్చుకుని పెద్ద స్టార్ కాలేకపోయాడన్న ఉద్దేశంతో నాగ్.. తన చిన్న కొడుకు లాంచింగ్‌ను భారీగానే ప్లాన్ చేశాడు. అప్పటికి పెద్ద డైరెక్టర్లలో ఒకడు, మాస్ సినిమాలను బాగా డీల్ చేస్తాడని పేరున్న వి.వి.వినాయక్‌ను అఖిల్ తొలి సినిమా కోసం ఎంచుకున్నాడు.
భారీ బడ్జెట్లో ‘అఖిల్’ సినిమా తీశారు. దానికి బంపర్ క్రేజ్ కూడా వచ్చింది. కానీ ఆ సినిమా అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. తర్వాత నాగ్ దగ్గరుండి అన్నీ చూసుకుని చేసిన ‘హలో’కు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ సంగతీ తెలిసిందే. మొత్తానికి హ్యాట్రిక్ డిజాస్టర్లతో అఖిల్ కెరీర్ తిరోగమన దిశలోకి వెళ్లిపోయింది. యువ కథానాయకులకు మంచి హిట్లిస్తాడని పేరున్న అల్లు అరవింద్‌ను నమ్మి అఖిల్‌ను ఆయన చేతిలో పెడితే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సంగతి ఎంతకీ తెగకుండా ఉంది.
కరోనా లేకుంటే గత ఏడాది మే 1న రావాల్సిన సినిమా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ పున:ప్రారంభించారు. టాకీ పార్ట్ అంతా అయినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమా విడుదల ఎప్పుడన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో పూర్తయిన, మేకింగ్ దశలో ఉన్న సినిమాలన్నీ దాదాపు విడుదల ఖరారు చేసుకున్నాయి. ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’, అఖిల్ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రమే సందిగ్ధతను కొనసాగిస్తున్నాయి.
ప్రభాస్ సినిమా అంటే పెద్ద రేంజి, వివిధ భాషల్లో డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి డేట్ ఖరారు చేసుకోవాలి. కానీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కు ఆ ఇబ్బంది ఏమీ లేదు. అయినా సరే.. ఈ సినిమా రిలీజ్‌పై అయోమయం కొనసాగుతోంది. సినిమా పూర్తయినట్లయితే విడుదల గురించి ఎందుకు మాట్లాడట్లేదు.. మూవీ గురించి ఏ అప్‌డేట్ ఎందుకు ఇవ్వట్లేదు అన్నది ప్రశ్న.
కొందరేమో ఔట్ పుట్ విషయంలో సంతృప్తి చెందని నాగ్, అరవింద్.. అఖిల్ కెరీర్‌కు ఈ సినిమా ఎంత ముఖ్యమో దృష్టిలో ఉంచుకుని కరెక్షన్లు చెప్పారని, రీషూట్లకు ప్లాన్ చేస్తున్నారని, అందుకే ఈ ఆలస్యం అని అంటున్నారు. కారణం ఏదైనా కానీ.. అక్కినేని అభిమానులు అఖిల్ విషయంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద కూడా ఆశలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on February 2, 2021 3:40 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్‌లో ఇప్పటిదాకా పెద్ద…