Movie News

టాలీవుడ్‌పై కన్నడ హీరో ఆగ్రహం


కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు కోపం వచ్చింది. ఆ కోపం తెలుగు సినీ పరిశ్రమ మీద కావడం గమనార్హం. తన కొత్త సినిమా ‘రాబర్ట్’ను తెలుగులో రిలీజ్ చేయడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సహకరించడం లేదన్నది అతడి ఆరోపణ. కన్నడలో పెద్ద మాస్ హీరోల్లో ఒకడైన దర్శన్ ప్రధాన పాత్రలో ‘రాబర్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇంతకుముందైతే కన్నడ సినిమాలు కర్ణాటక దాటితే ఏదో నామమాత్రంగానే విడుదలయ్యేవి. కానీ ‘కేజీఎఫ్’ తర్వాత అక్కడి హీరోలందరికీ కన్నడ రాష్ట్రం అవతల మార్కెట్ పెంచుకోవాలన్న ఆశ పుట్టింది. ఈ క్రమంలోనే దర్శన్ కూడా ‘రాబర్ట్’ను తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నాడు. దీని గురించి అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. తెలుగు పోస్టర్ కూడా వదిలారు.

కానీ మార్చి 11న తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి. శర్వానంద్ మూవీ ‘శ్రీకారం’తో పాటు మంచు విష్ణు చిత్రం ‘మోసగాళ్లు’, శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్‌ల ‘గాలి సంపత్’, నవీన్ పొలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణల ‘జాతి రత్నాలు’ కూడా అదే రోజున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మన సినిమాలకే అప్పుడు థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. అలాంటిది ఇక్కడ ఏమాత్రం గుర్తింపు, మార్కెట్ లేని దర్శన్ సినిమా కోసం ఎక్కడ థియేటర్లు కేటాయిస్తారు? అతడి కోసం ఎవరు పోరాడతారు? ఐతే తన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సహకరించడం లేదంటూ దర్శన్ కన్నడ ఫిలించాంబర్‌ను ఆశ్రయించాడు.

కర్ణాటకలో తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలు పెద్ద ఎత్తున రిలీజవుతాయని, దీని వల్ల మన సినిమాలు చచ్చిపోతున్నాయని.. మన సినిమాలను వేరే భాషల్లో విడుల చేయడానికి సహకారం అందనపుడు ఇతర భాషా చిత్రాలకు మనం ఇంత ప్రాధాన్యం ఎందుకివ్వాలని అతను ప్రశ్నించాడు. ఐతే తెలుగు సినిమాలను కన్నడిగులు, అక్కడుండే తెలుగువాళ్లు ఎగబడి చూస్తారు. కన్నడ సినిమాల పట్ల మనవాళ్లకు ఆసక్తి ఉండదు. ఏదైనా డిమాండ్-సప్లై ఆధారంగానే ఉంటుంది. ఎవరి ఆసక్తి వాళ్లది. అది గుర్తించకుండా తెలుగు సినిమాల మీద పడి ఏడిస్తే ఏం లాభం?

This post was last modified on February 1, 2021 3:08 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

40 mins ago

నిఖిల్ క్రేజీ మూవీ ఏమైనట్టు

రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…

41 mins ago

ప్ర‌చారంలో దుమ్మురేపుతున్న భ‌ర్త‌లు!

రాజ‌కీయాలు మారాయి. ఒక‌ప్పుడు భ‌ర్త‌లు ఎన్నిక‌ల రంగంలో ఉంటే.. భార్య‌లు ఉడ‌తా భ‌క్తిగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చూసుకునే వారు. అది…

2 hours ago

థియేటర్ల నిస్తేజం – బాక్సాఫీసుకు నీరసం

ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…

3 hours ago

తెర‌పైకి మ‌రోసారి బెట్టింగులు.. ఏపీలో హాట్ సీట్ల‌పైనే!

రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజ‌కీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్క‌డ…

4 hours ago

విక్ర‌మ్ కొడుకు.. క్రేజీ మూవీ

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో చేసిన రెండు సినిమాల‌తోనే చాలా ప్రామిసింగ్‌గా అనిపించిన వార‌సుల్లో ధ్రువ్ విక్ర‌మ్ ఒక‌డు. అర్జున్…

5 hours ago