టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణకు, రవితేజకు ఏవో వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లు చాలా ఏళ్ల కిందట ఓ ప్రచారం జరిగింది. ఆ గాసిప్ సంగతి పక్కన పెడితే.. వీరి మధ్య ఆసక్తికర బాక్సాఫీస్ పోరాటాలు జరిగాయి. రవితేజతో పోలిస్తే బాలయ్య పెద్ద హీరో. ఆయన మార్కెట్ కూడా ఎక్కువ. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాలయ్యపై ఒకటికి మూడుసార్లు పైచేయి సాధించాడు రవితేజ. నాలుగుసార్లు వీరి సినిమాలో ఒకే సమయంలో రిలీజైతే ఒక్కసారి కూడా బాలయ్య ఆధిపత్యం ప్రదర్శించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ముందుగా 2008 సంక్రాంతికి బాలయ్య సినిమా ఒక్క మగాడు, రవితేజ చిత్రం కృష్ణ పోటీ పడ్డాయి. నందమూరి హీరో సినిమా డిజాస్టర్ అయితే.. మాస్ రాజా చిత్రం సూపర్ హిట్టయింది. స్పష్టమైన పైచేయి సాధించింది. ఆ తర్వాతి ఏడాది మే 1న బాలయ్య సినిమా మిత్రుడు వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఇంకో వారానికి రవితేజ సినిమా కిక్ రిలీజై నందమూరి హీరో సినిమా థియేటర్ల నుంచి లేచిపోయేలా చేసింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇంకో రెండేళ్లకు సంక్రాంతికే పోటీ పడ్డారు బాలయ్య, రవితేజ. ఈసారి కూడా ఫలితం మారలేదు. బాలయ్య సినిమా పరమవీరచక్ర ఆయన కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మాస్ రాజా సినిమా మిరపకాయ్ సూపర్ హిట్టయింది.
ఇక 2013లో రవితేజ నుంచి వచ్చిన వీర, బాలయ్య చేసిన శ్రీరామరాజ్యం కూడా ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఐతే వీర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. శ్రీరామరాజ్యం క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. అప్పుడు ఏ సినిమాదీ పైచేయిగా చెప్పలేం.
కట్ చేస్తే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ పోరుకు సిద్ధమయ్యారు రవితేజ, బాలయ్య. మే 28కి తన కొత్త చిత్రం ఖిలాడిని మాస్ రాజా షెడ్యూల్ చేయగా.. ఇప్పుడు బోయపాటితో బాలయ్య చేస్తున్న సినిమాను కూడా అదే తేదీకి ఖరారు చేశారు. ఈసారి ఎక్కువ అంచనాలున్నది బాలయ్య సినిమాకే. ఈసారైనా రవితేజపై పైచేయి సాధించాలనే బాలయ్య తన సినిమాను అతడి చిత్రానికి పోటీగా నిలిపాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి వీరి పోరులో ఈసారి ఆధిపత్యం ఎవరిదో?
This post was last modified on February 1, 2021 10:19 am
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…