సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటూ నిర్మాతలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్నారు కానీ ముఖ్యమంత్రి ఇంకా షూటింగ్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. జూన్ నుంచి లాక్ డౌన్ లిఫ్ట్ చేస్తారని, షూటింగ్స్ కి పర్మిషన్ ఇస్తారని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు. అయితే షూటింగ్స్ కి పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మంది సిబ్బందితో పని చేయడం పట్ల చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి.
అందుకే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేదానిపై ఇప్పటికే నిర్మాతలు, దర్శకులు కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నారు. వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించి కోర్ట్ రూమ్ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. కోర్ట్ సీన్ అంటే చిన్న ప్లేస్ లో క్రౌడ్ ఎక్కువే ఉంటుంది. ఈ సమయంలో అలాంటిది చేయడం రిస్క్ కనుక ఈ సన్నివేశాలకు షాట్ డివిజన్ చేస్తున్నారట. కేవలం క్లోజప్ షాట్స్ లేదా ఒకరిద్దరు నటీనటులు మాత్రమే అవసరం అయ్యే సజెషన్ షాట్స్ లాంటివి మాత్రం ముందుగా ఫినిష్ చేయాలని చూస్తున్నారట. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయితే ఆగష్టు లోగా పూర్తి చేసేసేలా ప్రణాళిక వేసుకున్నారట.
This post was last modified on May 6, 2020 8:17 pm
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…