Movie News

మోక్షజ్ఞ అప్పటిదాకా వెయిట్ చేయాలి

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూకి ఇంకా అడుగులు మొదలు కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ప్యాన్ ఇండియా మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చి నెలలు గడిచిపోయాయి. ఇంకా రెగ్యులర్ సెట్స్ లోకి చిత్ర బృందం అడుగు పెట్టలేదు. కారణం విశ్వంభర. ప్రస్తుతం ట్రైలర్ కట్, ఆర్టిస్టుల డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్న వశిష్ఠ అది రిలీజయ్యే దాకా దేని మీద ఫోకస్ పెట్టలేడు.

అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సంక్రాంతికి రావడం పక్కాని లీక్స్ వదులుతున్నారు కానీ యువి క్రియేషన్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం అయోమయాన్ని ఇంకా పెంచుతోంది. ఇంకోవైపు కాకా జనవరి 13 వచ్చేస్తుందంటూ కెవిఎన్ టీమ్ అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఊదేస్తోంది. రెండు క్లాష్ అవుతాయని ఇంకో వర్గం రాగాలు మొదలుపెట్టింది. చిరంజీవి మటుకు ప్రస్తుతం దీని గురించి నేరుగా స్పందించే స్థితిలో లేరు. చర్చలు జరుగుతున్నాయట.

ఇదంతా ఒక కొలిక్కి వచ్చి విశ్వంభర థియేటర్లలో అడుగుపెట్టిన కొద్దిరోజుల వరకు మోక్షజ్ఞకు వెయిటింగ్ తప్పదు. ఆ తర్వాత కూడా వెంటనే షూట్ ఉండకపోవచ్చని అంటున్నారు. స్క్రిప్ట్ ని ఫైనల్ నెరేషన్ కి రెడీ చేసి, బాలకృష్ణకు వినిపించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తో పాటు ముహూర్తం పెట్టించుకుని ఆపై ప్రారంభించాలి. ఎంతలేదన్నా దీనికో మూడు నాలుగు నెలలు టైం పట్టేలా ఉంది. అందుకే మోక్షజ్ఞ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మైత్రి బృందం నుంచి రావడం లేదు.

సరే ఎప్పుడు స్టార్ట్ చేసినా వీలైనంత త్వరగా అభిమానులకు కానుక ఇచ్చేలా వశిష్ఠ ప్లాన్ చేసుకోవాలి. కావాలని చేసింది కాకపోయినా విశ్వంభర మూడున్నర సంవత్సరాలు నిర్మాణంలో ఉంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీకి ప్రాధమిక బాధ్యుడు దర్శకుడే అవుతాడు. మోక్షజ్ఞ సినిమాలోనూ విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉంటుందని టాక్. వశిష్ఠ మరోసారి ఫాంటసీ ప్రపంచంతోనే రాబోతున్నాడని వినికిడి. సో విశ్వంభర విషయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండాలి. 

This post was last modified on November 25, 2026 11:26 pm

Share

Recent Posts

యూపీలో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా? ఊడుతుందా??

"మేము ఆడుకునేవాళ్ళం కాదు..." ఈ మాటలు అన్నది ఎవరో దారినపోయే దానయ్య కాదు. ఏళ్ళ తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్…

2 hours ago

బాబు స్పీడుగా ఉన్నారు: ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌శంస‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పీడుగా ప‌నిచేస్తున్నార‌ని, ఈ స్పీడు చూస్తే.. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు అనుకున్న స‌మ‌యానికంటే కూడా…

5 hours ago

ఈ సర్ మాకొద్దు బాబోయ్

కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌(స‌ర్‌)పై దేశంలోని ప‌లు రాష్ట్రాలు అభ్యంత‌రం…

6 hours ago

టీడీపీ సంచ‌ల‌న మిలియన్ రికార్డు

ఏపీ అధికార పార్టీ టీడీపీ సంచ‌ల‌న రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ ప్రారంభించిన `మై-టీడీపీ` యాప్‌.. స్వ‌ల్ప‌కాలంలోనే 10 ల‌క్ష‌ల…

7 hours ago

ప‌వ‌న్‌తో బెంగాల్ టైగ‌ర్ చేద్దామ‌నుకుంటే

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌చ్చ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కాంబినేష‌న్లో ఒక సినిమా కోసం స‌న్నాహాలు జ‌రిగి.. ఏడాదికి…

7 hours ago

బ్యాటర్ లేకుండానే బౌలింగ్.. ఇదేం విచిత్రమైన ఔట్!

క్రికెట్‌లో బౌలర్‌కు ఫ్రీ హిట్ లాంటి అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరిగ్గా…

7 hours ago