Movie News

కొత్త పాఠం నేర్పించిన రిపీట్ రిజల్ట్

గత వారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ సూపర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. యాభై కోట్ల గ్రాస్ చిన్న విషయం కాదు. అది కూడా ఆకాశంలో ఒక తార, ఓమ్ లాంటి తీవ్రమైన పోటీని తట్టుకుని నిలవడం ఘనతే. సోషల్ మీడియా పోషించిన పాత్ర పెద్దదే. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకుని వాళ్ళ ద్వారానే ప్రమోట్ అయిన విధానం వసూళ్లు తెచ్చి పెట్టింది. అయితే ఇక్కడ పాఠంగా చూడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కోణంలో విశ్లేషించాల్సినవి.

ఈ నగరానికి ఏమైంది రిపీట్ వసూళ్లలో అత్యధిక భాగం నైజామ్ అది కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత ఓవర్సీస్ కీలక పాత్ర పోషించింది. ఆంధ్ర సీడెడ్ సైడ్ పెద్దగా మేజిక్ చేయలేదని నెంబర్లు చెబుతున్నాయి. మెయిన్ సెంటర్స్, జిల్లా కేంద్రాల్లో బాగున్నప్పటికీ మిగిలిన చోట్ల వీక్ డేస్ లో కొంచెం ఎదురీత కనిపించింది. ఇది యువత కోసమే అనేలా పబ్లిసిటీ జరగడం చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసింది. రెగ్యులర్ మాస్ జనాలు కూడా రాలేదు.

అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కథను రాసుకున్నప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందనే దానికి ఈ నగరానికి ఏమైంది రిపీట్ ఉదాహరణగా నిలుస్తోంది. తరుణ్ భాస్కర్ లో ఫిలిం మేకర్ అయితే బయటికి వచ్చాడు కానీ అసలైన రైటర్, టెక్నీషియన్ ఇంకా ఆవిష్కృతం కావాలి. కీడా కోలాలు సరే పెళ్లి చూపులు లాంటి ఎంటర్ టైనర్లతో పాటు తన జానర్ మరింత విస్తృతపడేలా కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న స్టోరీల వైపు వెళ్ళాలి. శేఖర్ కమ్ముల తరహాలో ఆలోచించాలి.

ఈ మూవీకే కాదు రాబోయే రోజుల్లో కేవలం ట్రెండ్ ని నమ్ముకుని సినిమా తీస్తే వసూళ్ల పరంగా పరిమితులు అయితే చూడాల్సి ఉంటుంది. మొదటి భాగం లాగా కాకుండా సీక్వెల్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల టీమ్ అయితే హ్యాపీగా ఉంది. రెండో వీకెండ్ లో మళ్ళీ ఊపందుకునే అవకాశాలున్నాయి. కాకపోతే ఆకాశంలో ఒక తార పికప్ బాగున్న నేపథ్యంలో ఎవరు ముందడుగు వేస్తారనేది పది రోజుల తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. అన్నట్టు రిపీట్ తర్వాత మూడో భాగం ప్రతిపాదన ఉందని టాక్.. 

This post was last modified on November 26, 2026 9:54 am

Share

Recent Posts

పెళ్లి వేడుకలో పిచ్చి సాహసం.. గుర్రపు పందేల కోసం..

వినోదం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకు తెస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బీహార్‌లో జరిగిన…

1 hour ago

హోమ్ గ్రౌండ్‌లో బయటపడిన ఓమ్ బలహీనత

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రూపొందిన ఓమ్ వంద కోట్ల గ్రాస్ దాటేసింది. ఇందులో…

1 hour ago

రామాయణ 2 అంచనాలకు రంగం సిద్ధమేనా

కొన్ని నెలల క్రితం టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కు గురైన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు…

2 hours ago

అనంత్ అంబానీతో షారుఖ్ వీడియో వైరల్.. ఇప్పుడు లీగల్ వార్

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా కారణంగా కాదు.. సోషల్ మీడియాలో…

2 hours ago

ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు శర్వా

రేపు భోగి విడుదల కానుంది. ప్రమోషన్స్ పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు,…

2 hours ago

ఎన్టీఆర్ నవ్వులకు రావిపూడి హామీ

ఎవరూ ఊహించని విధంగా కొద్దిరోజుల క్రితం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి సినిమా గురించి మూవీ లవర్స్…

3 hours ago