టాలీవుడ్ టాప్ స్టార్లు డీగ్లామరస్‌గా కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు. సిక్స్ ప్యాక్స్ అవీ చేసి, ఫిజిక్ మార్చుకుని కనిపించడానికి సిద్ధం అంటారే కానీ.. డీగ్లామరస్ రోల్స్ అంటే మాత్రం దండం పెట్టేస్తారు. తమిళంలో విక్రమ్ లాగానో, సూర్య మాదిరో గుండ్లు చేయించుకోమన్నా.. లేదా అడ్డదిడ్డంగా జుట్టు, గడ్డం పెంచమన్నా.. మురికి బట్టలతో కనిపించమంటే అంతే సంగతులు. ఇప్పటిదాకా టాలీవుడ్ స్టార్లెవ్వరూ కూడా అలాంటి రోల్స్ చేయనే లేదు.
ఐతే తొలిసారి అల్లు అర్జున్ ఈ సాహసం చేస్తున్నాడు. ‘పుష్ప’ సినిమా కోసం అతను ఎలాంటి అవతారం ఎత్తాడో ఇప్పటికే చూశాం. ఫస్ట్ లుక్, ఆన్ లొకేషన్ స్టిల్స్ చూసి బన్నీ అభిమానులతో సహా అందరూ షాకైపోయారు. కొందరు దీనిపై నెగెటివ్ కామెంట్లు కూడా చేశారు. బన్నీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగలా తయారయ్యాడని కౌంటర్లు వేశారు. కానీ బన్నీ అండ్ కో అవేమీ పట్టించుకోలేదు.
ముందు బన్నీ స్టిల్స్ చూసి సినిమాలో కొంత సేపు మాత్రమే ఈ లుక్‌లో కనిపిస్తాడేమో.. మళ్లీ అవతారం మార్చుకుని మామూలుగా తయారవుతాడేమో అనుకున్నారు. కానీ లేటెస్ట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే బన్నీ మరింత నాటుగా, ఊర మాస్‌గా కనిపించాడు. ఇది మామూలు డీగ్లామర్ రోల్ కాదు అనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తే. తమిళ స్టార్లు సైతం మరీ ఇంత నాటుగా కనిపించడానికి సందేహిస్తారేమో అనిపిస్తోంది.
‘అల వైకుంఠపురములో’ అంత స్టైలిష్‌గా కనిపించి ఒక్కసారిగా ఇంత మేకోవర్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి పాత్రను డిజైన్ చేసిన సుక్కుకు, దర్శకుడిని నమ్మి ఆయన చెప్పినట్లు కనిపించడానికి ఒప్పుకున్న బన్నీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి గట్స్ అందరికీ ఉండవు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడితే, బన్నీ చేస్తున్న పుష్పరాజ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఇదో ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశముంది. మున్ముందు మిగతా స్టార్లు కూడా ఇలాంటి డీగ్లామరస్ రోల్స్ చేయడానికి ధైర్యం చేయొచ్చు.
This post was last modified on January 28, 2021 3:42 pm
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…