యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడు. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రియాలిటీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. రీ రికార్డింగ్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. బిజినెస్ ఆల్రెడీ అయిపోయింది. డిసెంబర్ 25 విడుదలకు రంగం సిద్ధం చేసి దానికి అనుగుణంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇంకోవైపు నిర్మాతగా వ్యవహరించిన హారర్ మూవీ హతః ఫస్ట్ కాపీ సిద్ధమై డిసెంబర్ నెలలో ఎప్పుడు రావాలనే దాని గురించి ఆలోచనలో ఉంది.
ఇవిలా ఉండగా కిరణ్ కొత్త మూవీ ఇవాళ ప్రారంభమయ్యింది. సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి సంయుక్త నిర్మాణంలో రూపొందబోయే ఈ సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. సుకుమార్ దగ్గర పుష్పకు పని చేసిన వీర కోగటం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తుండగా మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడి చేస్తారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ ఉండేలా ప్లానింగ్ జరుగుతోంది.
టీమ్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇదో క్రైమ్ థ్రిల్లర్. కొన్నేళ్ల క్రితం కర్నూలు నగరంలో యదార్ధంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని దానికి సినిమాటిక్ ఎలిమెంట్స్ జోడించి ఒక కొత్త అనుభూతి ఇచ్చేలా డిజైన్ చేసుకున్నారట. ప్రస్తుతానికి ఈ వివరం తప్ప ఇంకే డీటెయిల్స్ బయటకి రాలేదు. సుకుమార్ ఆమోద ముద్ర పడిందంటే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విశేషం ఉంటుంది. టైటిల్ కూడా రికార్డ్ అని వెరైటీగా పెట్టడం ద్వారా కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు.
కెమెరాతో ఏదో చూడకూడనిది షూట్ చేసినట్టుగా ఇచ్చిన సంకేతం, కొండారెడ్డి బురుజుతో పాటు కిరణ్ సైడ్ ఫేస్ నుంచి వెనుక గార్దబ్దంని లైట్ గా రివీల్ చేసి, ముందు ఓ అమ్మాయిని చూపించి చూపించనట్టు పెట్టడం వెనుక ఏదో సస్పెన్స్ అయితే కనిపిస్తోంది. అవేంటనేది టీజర్ లాంటివి వస్తే తప్ప అర్థం చేసుకోలేం. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్న కిరణ్ అబ్బవరంకు రికార్డ్ ఎలాంటి బ్రేక్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 23, 2026 9:12 pm
ఏ కొత్త సినిమా వచ్చినా.. రిలీజ్ ముంగిట థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం మామూలే. దాన్ని బట్టే తాము ఎలాంటి…
ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సంస్థల్లో ఎన్విడియా ఒకటి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం విస్తరిస్తున్న కొద్దీ…
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెలలోనే రెండు దఫాలుగా వచ్చే నెల 2న మూడో…
కర్నాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వయొలెన్ విధ్వాంసుడు హెచ్.ఎన్.భాస్కర్ అమెరికాలో అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ అయింది…
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ‘ఆర్జీవీ ఫిలిం ఫ్యాక్టరీ’ అని నిర్మాణ సంస్థ పెట్టి అనేకమంది శిష్యులను దర్శకులుగా పరిచయం…
తెలుగులో నేరుగా సినిమా చేయడానికి ముందే మన దగ్గర మంచి ఫాలోయింగ్ సంపాదించిన మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. అతను…