సోషల్ మీడియాలో జరిగే నెటిజన్ల కామెంట్లు, వాళ్లు చేసే ట్రోలింగ్‌నంతా పట్టించుకుంటే సెలబ్రెటీల బండి నడవడం చాలా కష్టం. అలాంటి వాటిని చూసీ చూడనట్లు వెళ్లిపోవాల్సిందే. అదే సమయంలో ఎవరైనా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే, తప్పుల్ని ఎత్తి చూపితే వాటికి స్పందించి దిద్దుకునే ప్రయత్నం చేయడమూ మంచిదే. కానీ నెగెటివ్ కామెంట్లను సానుకూలంగా తీసుకునే మనస్తత్వం అందరికీ ఉండదు. ఐతే మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఓ నెటిజన్ తన గురించి చేసిన కామెంట్‌కు ఫీలైపోకుండా తన తప్పును దిద్దుకుంటానని వినమ్రంగా చెప్పడం ట్విట్టర్ జనాలను ఆకట్టుకుంటోంది.
నిన్ననే రిలీజ్ చేసిన తేజు కొత్త చిత్రం ‘రిపబ్లిక్’ టైటిల్ మోషన్ పోస్టర్లో.. ‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’’ అన్న వాయిస్ ఓవర్ వినిపించిన సంగతి తెలిసిందే. ఐతే ఓ నెటిజన్ మోషన్ పోస్టర్ మీద స్పందిస్తూ.. తేజు ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అనే మాటను కూడా సరిగా పలకలేకపోయాడని.. దర్శకుడు దేవా కట్టా సినిమాల్లో డైలాగులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తూ ఓ ట్వీట్ వేశాడు.
ఐతే తన గురించి ఇలాంటి కామెంట్ చేస్తే ఏ హీరో అయినా ఫీలవుతాడు. కానీ తేజు అలా ఏమీ హర్టయిపోకుండా వినమ్రంగా ఆ నెటిజన్‌కు బదులిచ్చాడు. తనలోని ఈ లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు చెబుతూ, దాని మీద పని చేస్తానని ఆ నెటిజన్‌ను పేరు పెట్టి సంబోధిస్తూ ట్వీట్ వేయడం విశేషం. తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటానని చెప్పడానికి గట్స్ ఉండాలని, తేజు ఆ పని చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడని అతడిని నెటిజన్లు పొగిడేస్తున్నారు.
This post was last modified on January 26, 2021 4:08 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…