‘టక్ జగదీష్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసుకునే వీలున్నా కానీ ఆ చిత్ర బృందం సంక్రాంతి రేసులోకి వెళ్లకూడదంటూ తాపీగా సినిమా ముగించుకున్నారు. కరోనాతో తలనొప్పి దేనికిలెమ్మని హ్యాపీగా ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అందరికంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించేసారు. అయితే ఆ రోజు టక్ జగదీష్ వుందని తెలిసినా కానీ ‘లవ్‍స్టోరీ’ నిర్మాతలు ఏప్రిల్ 16నే తమ సినిమా రిలీజ్ ప్రకటించారు. నాగచైతన్య, సాయి పల్లవితో పాటు శేఖర్ కమ్ముల బ్రాండింగ్ కూడా కలిసిన ‘లవ్‍స్టోరీ’తో పోటీ అంటే ‘టక్ జగదీష్’కు కాస్త ఇబ్బందే. అఫ్‍కోర్స్ నాని సినిమాతో పోటీ వల్ల ‘లవ్‍స్టోరీ’కి కూడా ఇబ్బంది తప్పదు.
అనుకోకుండా ఈ రిలీజ్ డేట్లు వస్తే అనుకోవచ్చు కానీ తెలిసి తెలిసీ లవ్‍స్టోరీ నిర్మాతలు ఈ డేట్ ఫిక్స్ చేసారు. మరిప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు తలపడతాయా లేక తల్లీ బిడ్డా న్యాయమంటూ తలా ఒక తేదీని ఫిక్సవుతాయా అనేది ఆయా సినిమాల నిర్మాతల మధ్య జరిగే చర్చలతో ముడిపడి వుంటుంది. కానీ ఈ సినిమాలు కొన్న వాళ్లు మాత్రం ఈ న్యూస్‍తో హ్యాపీగా వుండరు. ఎందుకంటే ఈ రెండు సినిమాల బిజినెస్ రేంజ్‍తో పాటు టార్గెట్ ఆడియన్స్ కూడా ఒకరే. అందుకే సేమ్ డేట్‍కి రెండు సినిమాలు రావడం ఆల్‍మోస్ట్ సూసైడ్ లాంటిదే.
This post was last modified on January 26, 2021 12:05 am
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…