టాలీవుడ్లో చిన్న, పెద్ద అని తేడా లేకుండా రెండు రకాల సినిమాలూ నిర్మించే ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. 14 రీల్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతో కలిసి ఆయన నమో వెంకటేశ, దూకుడు, 1 నేనొక్కడినే, ఆగడు లాంటి భారీ చిత్రాలు నిర్మించారు. అవి చేస్తుండగానే ఏకే ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా ఓ బేనర్ పెట్టి చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.
ఒకప్పుడు అందులో చేసిన సినిమాల్లో కొన్ని ఆడాయి. కొన్ని పోయాయి. మధ్యలో రామ్, గోపీనాథ్‌లతో విభేదాలొచ్చి ఆయన 14 రీల్స్ నుంచి బయటికొచ్చేశారు. వాళ్లు 14 రీల్స్ ప్లస్ పేరుతో వేరే బేనర్ పెట్టి సినిమాల నిర్మాణం మొదలుపెట్టారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనే సినిమాలు తీస్తున్నారు. గత ఏడాది బ్లాక్‌బస్టర్ అయిన మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో అనిల్ కూడా భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.
ఐతే ఆయన చిన్న హీరోలతో తీస్తున్న సినిమాలు మాత్రం చేదు అనుభవాన్నే మిగులుస్తున్నాయి. యువ కథానాయకుల్ని నమ్మి ఆయన నిండా మునిగిపోతున్నారు. ఫామ్‌లో ఉన్న యువ కథానాయకుల మీద గురితో వాళ్లతో ఒప్పందాలు చేసుకుని వరుసగా సినిమాలు తీస్తున్నారు అనిల్. ఇంతకుముందు హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీదున్న యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో ఇలాగే అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ అతడితో తీసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రాజు గాడు.. ఇవేవీ ఆయనకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
ఇక అల్లరి నరేష్‌తో ఆయనకు ఎప్పట్నుంచో మంచి అసోసియేషన్ ఉంది. అతడితో మొదట్లో తీసిన ‘అహనా పెళ్లంట’ బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత మాత్రం అన్నీ చేదు అనుభవాలే. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యాక్షన్ 3డీ’తో పాటు జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా తేడా కొట్టాయి. చాలా ఏళ్ల విరామం తర్వాత, ఇప్పుడు నరేష్ ఏమాత్రం ఫామ్‌లో లేడని తెలిసి కూడా అతడితో ‘బంగారు బుల్లోడు’ అనే సినిమా తీశాడు అనిల్. అది కూడా అనిల్‌ను గట్టి దెబ్బే కొట్టినట్లుంది. ఈ దెబ్బతో ఒకే హీరోను నమ్ముకుని వరుస బెట్టి సినిమాలు తీయడం మానేస్తాడేమో అనిల్.
This post was last modified on January 26, 2021 9:09 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…