మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మీద నెలకొన్న ఉత్కంఠ వీడిపోయింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్లే దసరా సీజన్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ ఏడాది అక్టోబరు 15న దసరా కాగా.. దానికి రెండు రోజుల ముందు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాబోతోంది. ఇప్పటికే రెండుసార్లు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మారింది. మొదట 2020 జులై 30న విడుదల అన్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ డేట్ అందుకోలేమని భావించి 2021 జనవరి 8కి డేట్ మార్చారు.
కానీ కరోనా వల్ల మరోసారి సినిమాను వాయిదా వేయక తప్పలేదు. కొత్త డేట్ చెప్పడానికి రాజమౌళి టీం కొంత సమయం తీసుకుంది. కరోనా బ్రేక్ తర్వాత మూడు నెలల్లో కొన్ని కీలక ఘట్టాలు ముగించి.. చకచకా క్లైమాక్స్ వరకు వచ్చేయడంతో ఇప్పుడిక రిలీజ్ డేట్ ఇచ్చి దాన్ని అందుకోగలమనే కాన్ఫిడెన్స్ వచ్చినట్లుంది.
నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడిప్పుడే ప్రకటన వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ వివిధ ఇండస్ట్రీల్లో ఈ సినిమా విడుదల తేదీ మీద ఉత్కంఠ నెలకొనడం.. బాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి డేట్ విషయమై ఆరాలు కూడా రావడంతో విడుదల తేదీపై ప్రకటన చేయాల్సి వచ్చినట్లు సమాచారం.
‘బాహుబలి’ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పాన్ ఇండియా స్థాయిలో భారీగానే సినిమా రిలీజ్ కాబోతోంది. అలాంటపుడు తాము కర్చీఫ్ వేసిన సీజన్ల మీద వచ్చి ‘ఆర్ఆర్ఆర్’ పడితే చాలా ఇబ్బందవుతుంది. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ డేట్ ప్రకటిస్తే అందుకనుగుణంగా తమ సినిమాలను ఫిక్స్ చేసుకుంటామని టాలీవుడ్‌తో పాటు వేరే పరిశ్రమల నుంచి విన్నపాలు రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం డేట్ ఇవ్వాల్సి వచ్చిందట.
ఈ ఏడాది దీపావళి, వచ్చే ఏడాది సంక్రాంతి మీద ‘ఆర్ఆర్ఆర్’ పడకపోవడంతో అందరికీ ఊరటనిస్తోంది. దీపావళికి హిందీ, తమిళంలో పెద్ద సినిమాలు వరుస కడుతుంటాయి. ఇక సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో మూణ్నాలుగు సినిమాల చొప్పున రిలీజవుతుంటాయి. ఆ సీజన్లతో పోలిస్తే దసరాకు పోటీ తక్కువే. కాబట్టి ఆ డేట్ ఎంచుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ టీంకూ ఇబ్బంది లేదు. సోలో రిలీజ్ ఖాయం. అలాగే ఇతర సినిమాల నిర్మాతలకూ ఇబ్బంది లేదు. ఆ రకంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం మంచి డేట్ ఎంచుకున్నట్లే.
This post was last modified on %s = human-readable time difference 6:57 pm
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…