ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా కోసం పాట షూటింగ్ పూర్తి చేసుకుని నిన్న రాత్రి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ, శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సినిమాల్లోకి రాకముందు శేఖర్ మాస్టర్ విజయవాడలో పండ్ల వ్యాపారం చేసేవారు. ఇప్పుడు ఆయన ప్రయాణిస్తున్న కారును పండ్ల లోడ్‌తో ఉన్న లారీ ఢీకొట్టడం యాదృచ్ఛికంగా మారింది.
మరోవైపు శేఖర్ మాస్టర్ నిన్ననే స్వామి మాల ధరించినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
This post was last modified on November 12, 2026 11:00 am
రేపు డీఎన్‌కే విడుదల కానుంది. మైత్రి నిర్మాణం కావడంతో రిలీజ్ పరంగా మంచి స్క్రీన్ కౌంట్ దక్కనుంది. రామాయణ పార్ట్…
సాధారణంగా భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు కుటుంబాలకే పరిమితమవుతుంటాయి. కానీ కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఓ వైవాహిక వివాదం మాత్రం…
ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంత కరువు పరిస్థితిలో కూడా 700 కిలోమీటర్లు నీరు పారించారని, వెలుగొండ, పోలవరం ప్రాజెక్టులు ప్రారంభించి…
ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన…
ఉద్యోగుల పని పరిస్థితులు, వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హోటళ్లు,…
రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్యక్షుడు వి. విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో…