Movie News

సంక్రాంతికి రావాల్సింది… మ‌హాశివ‌రాత్రికి ఫిక్స‌యింది


థియేట‌ర్లు పునఃప్రారంభమై, మ‌ళ్లీ ప్రేక్ష‌కులు థియేట‌ర్లు రావ‌డం మొద‌ల‌వ‌గానే టాలీవుడ్ నిర్మాత‌లు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌ట్లేదు. ఆల్రెడీ విడుద‌ల కోసం చూస్తున్న సినిమాలు, మ‌ధ్య‌లో పూర్త‌యిన‌వి, త్వ‌ర‌లో పూర్తి కాబోయేవి.. ఇలా చాలా సినిమాలు లైన్లో ఉండ‌టంతో రిలీజ్ డేట్‌లు ఖ‌రారు చేసుకోవ‌డానికి పోటీ ప‌డుతున్నారు. వేస‌వికి అప్పుడే దాదాపుగా అన్ని బెర్తులు బుక్ అయిపోయాయి. అన్ సీజ‌న్ అనద‌గ్గ ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో కూడా సినిమాల సంద‌డి త‌క్కువ‌గా ఏమీ ఉండేలా లేదు.

ఫిబ్ర‌వ‌రి తొలి రెండు వారాల్లో ఉప్పెన‌, జాంబీ రెడ్డి, ఎ1 ఎక్స్‌ప్రెస్, శ‌శి లాంటి సినిమాలు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మార్చి నెల చివ‌ర్లో రంగ్‌దె, అర‌ణ్య రాబోతున్నాయి. మ‌ధ్య‌లో ఖాళీ దొరికిన వారాల‌కు కూడా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి సినిమాలు ఫిక్స్ అవుతున్నాయి.
ఫిబ్ర‌వ‌రి 19న నితిన్-చంద్ర‌శేఖ‌ర్ యేలేటిల చెక్‌ను ఫిక్స్ చేశారు.

ఇప్పుడు శ‌ర్వానంద్ సినిమా శ్రీకారం విడుద‌లకు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఈ చిత్రం మార్చి 11న మ‌హా శివ‌రాత్రి కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్ర‌క‌టించింది. శ‌ర్వాకు ఈ సినిమా విజ‌యం సాధించ‌డం చాలా అవ‌స‌రం. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు, ర‌ణ‌రంగం, జాను లాంటి డిజాస్ట‌ర్ల‌తో అత‌ను రేసులో బాగా వెనుక‌బ‌డిపోయాడు. శ్రీకారం టైటిల్, పోస్ట‌ర్లు, ఇత‌ర ప్రోమోలు చూస్తే శ‌త‌మానం భ‌వ‌తి త‌ర‌హా సినిమాలా క‌నిపిస్తోంది.

ఈ సినిమా సంక్రాంతికి వ‌చ్చి ఉంటే ప‌ర్ఫెక్ట్ టైమింగ్ అయ్యేద‌ని, మంచి ఫ‌లితాన్నందుకునేద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాల అభిప్రాయం. కానీ అప్ప‌టికి సినిమాను సిద్ధం చేయ‌లేక‌పోయారు. వేస‌వికి విప‌రీత‌మైన పోటీ ఉండ‌టంతో మ‌ధ్యే మార్గంగా మ‌హాశివ‌రాత్రికి సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. కిషోర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన ఈ చిత్రంలో శ‌ర్వా స‌ర‌స‌న ప్రియాంక మోహ‌న్ న‌టించింది.

This post was last modified on January 24, 2021 12:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

2 hours ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

5 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

6 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

6 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

10 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

13 hours ago