పాపం హిట్టు కోసం దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు అల్లరి నరేష్. ఒకప్పుడు వరుసబెట్టి హిట్లు ఇచ్చి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగిన అల్లరోడు.. ‘సుడిగాడు’ తర్వాత హీరోగా ఒక్క హిట్టూ లేకుండా అల్లాడుతున్నాడు. ఒక టైంలో ఎక్కువగా స్పూఫ్‌ల మీదే అతడి సినిమాలు నడిచాయి. కానీ ‘సుడిగాడు’లో ఆ డోస్ బాగా ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఆ టైపు కామెడీ జనాలకు మొహం మొత్తేయడం, అల్లరోడి సినిమాలు ఒక మూసలో సాగిపోవడం ప్రతికూలంగా మారింది.
మధ్య మధ్యలో కొంచెం రూటు మార్చి వేరే కథలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మధ్యలో అతడి కెరీర్లో చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. ‘మహర్షి’ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయకుంటే ఆ గ్యాప్ ఇంకా పెరిగిపోయేది. ఎట్టకేలకు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే.. బంగారు బుల్లోడు.
ఇంతకుముందు అల్లరోడిగా ‘యాక్షన్’ సహా కొన్ని సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాత అనిల్ సుంకర ప్రొడక్షన్లో ‘నందిని నర్సింగ్ హోం’ ఫేమ్ గిరి రూపొందవించిన చిత్రం.. బంగారు బుల్లోడు. ట్రైలర్ చూస్తే నరేష్ ఒకప్పుడు చేసిన కామెడీ సినిమాల్లాగే కనిపించింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని వేరే వాళ్లకు రెంట్‌కు ఇచ్చి డబ్బులు సంపాదించే బ్యాంకు ఉద్యోగి పాత్రలో నరేష్ కనిపించనున్నాడు ఈ చిత్రంలో.
వెన్నెల కిషోర్, ప్రవీణ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ లాంటి కమెడియన్లు చాలామంది నరేష్‌కు అండగా ఈ సినిమాలో ఉన్నారు. నవ్వించేందుకు వాళ్లు గట్టి ప్రయత్నమే చేసినట్లున్నారు. పూజా జవేరి అందాలు సినిమాలో మరో ఆకర్షణ. సంక్రాంతి సినిమాల జోరు ఇంకా కొనసాగుతుండగా.. ‘బంగారు బుల్లోడు’కు బజ్ ఆశించిన స్థాయిలో లేదు. ఐతే ఒకప్పుడు తమను ఎంతగానో నవ్వించిన నరేష్‌కు హిట్ పడాలని ప్రేక్షకులు బాగానే కోరుకుంటున్నారు. సినిమా బాగుందంటే మళ్లీ అతడి సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తారు. ఈ నేపథ్యంలో ‘బంగారు బుల్లోడు’ వారిని ఏమేర ఆకర్షిస్తాడో.. అల్లరోడికి పట్టిన గ్రహణం ఈ సినిమాతో అయినా వీడుతుందేమో చూడాలి.
This post was last modified on January 23, 2021 11:56 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…