Movie News

టైసన్ నాయుడు… నిద్ర లేచాడు

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లాంటి మాస్ బ్యాకప్ ఉన్న హీరో సినిమా మూడేళ్లకు పైగా మోక్షం దక్కించుకోకుండా ల్యాబులోనే మగ్గుతూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. టైసన్ నాయుడు గురించి అభిమానులు ఎన్నిసార్లు అనుమాన పడ్డారో, అసలు వస్తుందో రాదో అనుకున్నారో కానీ, అంతకంతా ఆలస్యమవుతూ వెళ్తోంది తప్ప బయటికి వచ్చే మార్గం కనిపించలేదు. టీజర్ రిలీజైన సంగతే ఎవరికీ గుర్తు లేదంటే ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాని ఇదేదో ఆషామాషి మూవీ కాదు.

టైసన్ నాయుడు తీసింది 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ. లెజెండ్, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్స్ వీళ్ళ కథలో ఉన్నాయి. తర్వాత ఫ్లాపులు ఆర్థికంగా దెబ్బ కొట్టిన మాటా వాస్తవమే. గత ఏడాది అఖండ 2 తాండవం సక్సెస్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ అలా జరగకపోవడం కోలుకునే ఛాన్స్ తగ్గించేసింది. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసిన తర్వాత దర్శకుడు సాగర్ కె చంద్ర వర్క్ చేస్తున్న స్క్రిప్ట్, సినిమా టైసన్ నాయుడే. దీని కోసమే సంవత్సరాలు ఖర్చు పెట్టారు.

ఎట్టకేలకు టైసన్ నాయుడు నిద్ర లేచినట్టుగా కనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఒక డ్యూయెట్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. రేపు ప్రోమో వస్తుందట. ఇదంతా బాగానే ఉంది కానీ థియేటర్ రిలీజ్ డేట్ వీలైనంత త్వరగా లాక్ చేసుకోవడం ఉత్తమం. నవంబర్ లో ఛాన్స్ లేనట్టే. డిసెంబర్ లో ప్యాన్ ఇండియా సినిమాలు చాలా ఉన్నాయి. మధ్యలో ఏదైనా స్లాట్ ఖాళీ దొరికితే వచ్చేయడం బెటర్. లేదంటే జనవరి చివరి దాకా వెయిట్ చేయాల్సి ఉంది.

ట్విస్ట్ ఏంటంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో సినిమా హైందవ నవంబర్ 27 విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు ఇంతకు ముందే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఒకవేళ టైసన్ నాయుడు కనక ఈ స్లాట్ కోరుకుంటే నిర్మాతలు పరస్పర అంగీకారం కింద ఈ మార్పుకు ఒప్పుకుంటారేమో చూడాలి. కాకపోతే మధ్యలో ఓటిటి లిటిగేషన్లు ఉంటాయి కాబట్టి అంత సులభం కాకపోవచ్చు. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకో వారం పది రోజుల్లో రావొచ్చని అంటున్నారు. ఏదైనా వెయిటింగ్ అయితే తప్పదు.

This post was last modified on November 4, 2026 11:55 am

Share

Recent Posts

రిపీట్ అనిపించకపోవడమే నగరానికి ప్లస్సు

ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన ఈ నగరానికి ఏమైంది థియేటర్ పరంగా ఆశించిన పెద్ద విజయం అందుకోలేదన్నది వాస్తవం. నిన్న…

14 minutes ago

90 నిమిషాల వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్ రెడీ!

సోషల్ మీడియా ప్రపంచంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. యూజర్లను తమ ప్లాట్‌ఫామ్‌పైనే ఎక్కువ సమయం గడిపేలా చేసేందుకు సంస్థలు కొత్త…

22 minutes ago

అల్లు అరవింద్ హీరో… జయసుధ హీరోయిన్

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా ఎంతోమంది అగ్ర కథానాయకులకు జోడీగా ఎన్నో సినిమాలు చేశారు…

53 minutes ago

పవన్ కోసం రేణు… షారుఖ్ కోసం కరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ బద్రి, ఖుషి, బాలు లాంటి సినిమాల్లో చాలా స్టైలిష్‌గా, సూపర్ స్మార్ట్‌గా కనిపించాడు అంటే..…

58 minutes ago

జ‌గ‌న్ భ‌యాల‌ను పోగొట్టిన బ్యాలెట్లు!

ఎన్నిక‌లు ఏవైనా ఎన్నిక‌లే.. ఈ మాటంటే వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గిట్ట‌దు. ఎందుకంటే ఆయ‌న‌కు ఈవీఎంల‌పై న‌మ్మ‌కం పోయింది. 2024…

3 hours ago

చిన్న సినిమాలు.. పెద్ద పేర్లతో ఆశలు

చిన్న సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంత సులభం కాదు. ముఖ్యంగా కొత్త హీరోలు, దర్శకులతో తీసిన సినిమాలకు మొదటి…

3 hours ago