హిందీ సినిమాల రిలీజులతో మనకు పెద్ద సమస్య ఉండదు కానీ షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఉన్నాడంటే అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా నాగార్జున కింగ్ 100, బాలకృష్ణ దాదా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే వీటి డేట్లలో ఎలాంటి మార్పు లేదు. దానికి అనుగుణంగా దర్శక నిర్మాతలు షూటింగ్ వేగవంతం చేశారు. అయితే వీటితో పాటు షారుఖ్ ఖాన్ కింగ్ కూడా అదే తేదీకి వీటితో క్లాష్ అవ్వడం గురించి ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎందుకంటే కింగ్ మీద మంచి హైప్ ఉంది. డంకీ అంటే ఆఫ్ బీట్ తరహాలో సాగే సినిమా కాబట్టి అప్పట్లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ముందు నిలవలేకపోయింది. కానీ కింగ్ అలా కాదు. ప్రాపర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దీన్ని తీర్చిదిద్దారు. దీపికా పదుకునేతో పాటు కరీనా కపూర్ ఇందులో భాగమయ్యిందని ముంబై టాక్. నిన్న వదిలిన కొత్త పాటలో దీపికా ఒకటే కనిపించినా ఇప్ప్పుడు చూపించిన విజువల్స్ లో చాలా విషయాలు దాచి పెట్టారని టాక్.
ఇక అసలు విషయానికి వస్తే కింగ్ వల్ల ఓవర్సీస్ లో కింగ్ 100, దాదాకు సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే స్క్రీన్ షేరింగ్ చాలా టైట్ గా ఉంటుంది. అప్పటికే డ్యూన్ 3, అవెంజర్స్ డూమ్స్ డే రన్నింగ్ లో ఉంటాయి కాబట్టి నార్త్ అమెరికా తదితర దేశాల్లో కావాల్సినన్ని థియేటర్లు దొరకవు. అందులోనూ షారుఖ్ కి విదేశాల్లో బలమైన పట్టున్న నేపథ్యంలో సహజంగానే కింగ్ ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటుంది. ఫైనల్ గా టాక్ దేనికి బాగా వస్తే అవి నిలబడతాయి, గెలుస్తాయి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో షారుఖ్ కింగ్ కు మంచి మద్దతు ఉంటుంది. గతంలో జవాన్, పఠాన్ టైంలో ఋజువయ్యింది కూడా. పూర్తి ప్రమోషనల్ మెటీరియల్ వదిలిన తర్వాత కింగ్ మీద అంచనాలు ఎక్కడికో వెళ్తాయని యూనిట్ టాక్. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కీలక పాత్ర పోషించిన కింగ్ లో ఇంకా చాలా ఆకర్షణలున్నాయట. అభిషేక్ బచ్చన్, జాకీ శ్రోఫ్ తదితరులు నటించిన ఈ వయొలెంట్ రివేంజ్ డ్రామాలో షారుఖ్, సుహానా బాండింగ్ హైలైటవుతుందని వినికిడి.
This post was last modified on November 3, 2026 5:50 pm
వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఎంపీగారు అతిగా స్పందిస్తున్నారు. ఇలా అయితే.. భారీ జరిమానాను…
టాలీవుడ్లో ఇమేజ్, ఫ్యాన్స్ అని లెక్కలు వేసుకోకుండా.. కలెక్షన్లు, రికార్డుల గురించి అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరో విక్టరీ…
స్వీయ దర్శకత్వంలో, ఎవరూ టచ్ చేయని జానర్ అంటూ పూర్తిగా వయొలెంట్ రూటు పట్టిన విశ్వక్ సేన్ కు 'కల్ట్'…
ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు…
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం కీలక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయస్థాయిలో 'ఓట్…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డికి భారీ షాక్…