Political News

రెబ‌ల్స్… గెలిచేశారు.. ఏం చేస్తారు?!

టీడీపీ, జ‌నసేన‌, బీజేపీ కూట‌మి ఐక్యంగా ముందుకు సాగినా.. క్షేత్ర‌స్థాయిలో నెల‌కొన్న అసంతృప్తుల కార‌ణంగా.. ఆయా పార్టీల నుంచి రెబ‌ల్స్ ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు. ఈ క్ర‌మంలో చాలా మంది నాయ‌కుల‌పై టీడీపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. అయిన‌ప్ప‌టికీ వారేమీ వెన‌క్కి త‌గ్గ‌లేదు. మెజారిటీ నాయ‌కులు బ‌రిలోనే ఉన్నారు. పోటీ చేశారు. పోలింగ్ అనంత‌రం.. తాజాగా వ‌చ్చిన కౌంటింగ్‌లో మెజారిటీ స్థానాల్లో రెబ‌ల్స్ కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఇప్పుడు వీరు ఏ దారి ప‌డ‌తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

  • నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన టికెట్ ఆశించి భంగ ప‌డిన రెబల్‌ అభ్యర్థులు ఇద్ద‌రు ఒంట‌రిగానే పోటీ చేశారు. తాజా ఎన్నిక‌ల్లో వారు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇద్ద‌రూ కూడా మ‌హిళ‌లే కావ‌డం గ‌మ‌నార్హం. 11, 12 వార్డుల్లో ఈ మ‌హిళా నాయ‌కులు విజ‌యం సాధించారు.
  • ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా లో కూడా ముగ్గురు టీడీపీ రెబ‌ల్స్ నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్నారు. విజ‌య‌న‌గ‌రంలో ఇద్ద‌రు, కృష్ణాలో ఒక‌రు, గుంటూరు ఒక‌రు, బాప‌ట్ల జిల్లాలో ఇద్ద‌రు చొప్పున రెబ‌ల్ క్యాండిడేట్లు గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోనూ.. ఇద్ద‌రేసి చొప్పున స్వ‌తంత్రులుగా రంగంలోకి దిగిన టీడీపీ అభ్య‌ర్థులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరంతా టీడీపీ అభ్య‌ర్థుల‌ను ఓడించి.. గెల‌వ‌డం గ‌మ‌నార్హం.

కూట‌మి అప్ర‌మ‌త్తం..

వాస్త‌వానికి ఎన్నిక‌ల వేళ రెబ‌ల్స్‌పై వేటు వేసిన కూట‌మి పార్టీలు.. ఇప్పుడు అప్ర‌మ‌త్తం అయ్యాయి. గెలుపు పొందిన రెబ‌ల్స్‌.. వైసీపీలోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుసుకుని.. సీనియ‌ర్ నాయ‌కులు గెలిచిన వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తిరిగి పార్టీలోకి రావాల‌ని కోరుతున్న‌ట్టు తెలిసింది. అయితే.. దీనిపై రెబ‌ల్స్ నుంచి ఇంకా స‌మాచారం రాలేదు. మ‌రోవైపు.. రెబ‌ల్స్‌గా బ‌రిలో నిలిచి గెలిచిన వారిని వైసీపీ కూడా బుజ్జ‌గిస్తోంది. త‌మ పార్టీలోకి రావాలిని కోరుతున్న‌ట్టు స‌మాచారం. మొత్తంగా రెబ‌ల్స్ గెలుపు ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంది.

This post was last modified on November 3, 2026 5:25 pm

Share

Recent Posts

కింగ్‌ని తక్కువంచనా వేయకూడదు

హిందీ సినిమాల రిలీజులతో మనకు పెద్ద సమస్య ఉండదు కానీ షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఉన్నాడంటే అంత…

1 hour ago

వైసీపీ ఎంపీ ‘అతి’కి సుప్రీం బ్రేక్

వైసీపీ తిరుప‌తి ఎంపీ గురుమూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. "ఎంపీగారు అతిగా స్పందిస్తున్నారు. ఇలా అయితే.. భారీ జ‌రిమానాను…

2 hours ago

రావిపూడి+ సంక్రాంతి లేకపోతే.. వెంకీ ఇంతేనా?

టాలీవుడ్లో ఇమేజ్, ఫ్యాన్స్ అని లెక్కలు వేసుకోకుండా.. కలెక్షన్లు, రికార్డుల గురించి అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరో విక్టరీ…

2 hours ago

వేగం కన్నా ముఖ్యంగా వివేకం కావాలి

స్వీయ దర్శకత్వంలో, ఎవరూ టచ్ చేయని జానర్ అంటూ పూర్తిగా వయొలెంట్ రూటు పట్టిన విశ్వక్ సేన్ కు 'కల్ట్'…

3 hours ago

జగన్ స్పీచ్ లే ట్రోలర్స్ కు శ్రీరామ రక్ష

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు…

3 hours ago

“మీరు ఢిల్లీకి ఎందుకు రాలేదు?”.. రేవంత్ సీరియస్

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం కీల‌క చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయ‌స్థాయిలో 'ఓట్…

3 hours ago