మ‌మిత అస‌లు పేరు అది కాదా?

మ‌మిత బైజు.. ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ సినిమాలో ఒక సంచ‌లనం. కొన్నేళ్ల ముందు ప్రేమ‌లు సినిమాతో మ‌ల‌యాళీల‌తో పాటు ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. 2026లో సెన్సేష‌న‌ల్ స్ట్రీక్‌తో వార్త‌ల్లో నిలిచింది. ఆమె న‌టించిన మూడు సినిమాలు కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలో రూ.200 కోట్లు, అంత‌కంటే ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టాయి. జన‌నాయ‌గ‌న్, విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్, బెత్లెహాం కుడుంబ యూనిట్ చిత్రాల‌తో ఆమె పేరు మార్మోగింది. అయితే ఈ టాలెంటెడ్ బ్యూటీ అసలు పేరు మ‌మిత కాద‌ట‌. దీని వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆమె తాజాగా పంచుకుంది.

మ‌మిత‌ పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు నమిత అట‌. కానీ బర్త్ సర్టిఫికెట్ నమోదు చేసే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ‘నమిత’ కాస్తా ‘మమిత’గా ముద్రపడింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు నాలుగైదు సంవత్సరాల వరకు గమనించలేకపోయారు. మమితను పాఠశాలలో చేర్పించేందుకు సర్టిఫికెట్లను పరిశీలించినప్పుడు ఈ తప్పు బయటపడింది. అప్పటికే ఏళ్లు గడిచిపోవడం, అధికారిక కాగితాల్లో ఆ పేరే ఖరారు కావడంతో మార్చడం కుదరలేదట‌. అలా ఒక పొరపాటు వల్లే ఆమె పేరు నమిత నుంచి మమిత అయింది.

మ‌మిత ప్ర‌స్తుతం బ‌హు భాష‌ల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. తెలుగులో కూడా ఆమెకు మంచి డిమాండే ఉంది. కానీ డేట్లే ఖాళీ లేవు. ఆమె ప్ర‌స్తుతం కోటి రూపాయ‌ల‌కు పైగానే పారితోష‌కం అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇత‌ర భాష‌ల్లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నా.. ప్ర‌ధానంగా త‌న మాతృభాష‌ మ‌ల‌యాళంలోనే మమిత ఎక్కువ సినిమాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే ఆమెను ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీలో చూడ‌బోతున్న‌ట్లు స‌మాచారం.