తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే కథానాయికగా పరిచయం అయింది. కానీ పెద్ద బ్రేకేమీ రాలేదు. కానీ తెలుగులో ‘పెళ్ళిసంద-డి’ అనే మూవీతో పరిచయం అయినప్పటికీ, తన అందం-అభినయం-నృత్యాలతో ఆకట్టుకోవడంతో వరుస కట్టాయి. చకచకా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ అయిపోయింది.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. కానీ ఈ మధ్య శ్రీలీలకు వరుసగా ఫ్లాపులు వస్తుండడం.. తన నటన మీద విమర్శలు కూడా పెరగడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఆల్రెడీ ఓకే అయిన ఓ పెద్ద సినిమా నుంచి కూడా తనను తప్పించేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ చిత్రమే.. డేర్ డెవిల్. తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన అజిత్ ఇందులో హీరో.
‘డేర్ డెవిల్’ నుంచి శ్రీలీలను తప్పించి.. లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్‌ను తన స్థానంలోకి తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. శ్రీలీల ఫామ్ చూసి ఇది నిజమేనేమో అనుకున్నారంతా. కానీ ఈ వార్త నిజం కాదని తేలింది. శ్రీలీలనే ‘డేర్ డెవిల్’లో హీరోయిన్ అని తేలిపోయింది. కొన్ని నెలల ముందే ప్రకటించిన ఈ సినిమాకు తాజాగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో శ్రీలీలతో పాటు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా పాల్గొన్నారు. దీంతో ఈ మూవీలో కాయదు.. శ్రీలీలను రీప్లేస్ చేసిందనే ప్రచారం నిజం కాదని తేలిపోయింది.
ఈ చిత్రం శ్రీలీల కెరీర్‌కు ఎంతో కీలకం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా హిట్టవడమే కాదు.. శ్రీలీల పాత్ర, పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకోవాలి. అప్పుడే ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీలకు దాదాపుగా అవకాశాలు ఆగిపోయాయి. ‘డేర్ డెవిల్’తో సత్తా చాటి తమిళంలో బిజీ కావడమే కాక.. తెలుగులోనూ తిరిగి అవకాశాలు అందుకోవాలని శ్రీలీల చూస్తోంది. ఈ చిత్రాన్ని అజిత్ సొంత బేనర్లో తన భార్య షాలిని నిర్మిస్తుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates