తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప రైటర్లలో త్రివిక్రమ్ ఒకడు. దర్శకుడిగా కూడా ఆయన గొప్ప స్థాయినే అందుకున్నాడు. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. కెరీర్లో ఆయనకు కొన్ని ఎదురు దెబ్బలు తప్పలేదు కానీ.. వాటినుంచి త్వరగానే కోలుకున్నాడు. మళ్లీ తన స్థాయిని చాటిచెప్పాడు. కానీ ఈ మధ్య మాత్రం ఆయన మరీ సాధారణమైన సినిమాలు తీస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
2024 సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి అంతకుమించిన విమర్శలు తప్పట్లేదు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత అంతగా వ్యతిరేకత వస్తున్నది ఈ చిత్రానికే అంటే అతిశయోక్తి కాదు. వరుసగా రెండు సాధారణమైన సినిమాలను అందించడంతో.. త్రివిక్రమ్ తర్వాతి సినిమా విషయంలో ఆందోళన పెరిగిపోతోంది.
త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ అన్న సంగతి తెలిసిందే. ఇది త్రివిక్రమ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ. దీని బడ్జెట్ సహా అన్నీ వేరే లెవెలే. త్రివిక్రమ్, ఎన్టీఆర్ తొలిసారిగా పూర్తి స్థాయి పౌరాణికం చేయబోతున్నాం. ఈ జానర్లో ఇప్పుడు సినిమాలు బాగా అరుదైపోయాయి. మరి ఇప్పుడున్న ఫాంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అన్న భయాలున్నాయి. అల్లు అర్జున్ వదులుకున్న సినిమాను తారక్ చేస్తుండడంతో రిస్కేమో అని తన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. త్రివిక్రమ్ ఫాంలో లేడని, స్క్రిప్టు పకడ్బందీగా లేదని గుర్తించే బన్నీ తప్పుకున్నాడని.. ‘ఆదర్శ కుటుంబం’ కంటెంట్ చూస్తే త్రివిక్రమ్ పనితనం ఎలా ఉందో అర్థమవుతోందని.. కాబట్టి తారక్ ఇప్పుడు ఈ సినిమా చేయడం కరెక్టేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’ క్యాన్సిల్ చేయమని అంటున్న వాళ్లూ లేకపోలేదు.
ఐతే అదే సమయంలో అభిమానుల్లో ఇంకో వర్గం త్రివిక్రమ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ‘గాడ్ ఆఫ్ వార్’ కథ సహా దాని లెవెల్ వేరని, దాన్ని త్రివిక్రమ్ వేరేలా డీల్ చేస్తాడని.. ఆయన విద్వత్తు ఆ సినిమాలో చూపిస్తాడని అంటున్నారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత ‘అరవింద సమేత’తో త్రివిక్రమ్ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడో గుర్తుంచుకోవాలని, ఈసారి కూడా తారక్‌తో మరపురాని సినిమా తీసి తనేంటో చాటిచెబుతాడని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిలో ఎవరి మాట నిజమవుతుందో చూడాలి.
This post was last modified on November 2, 2026 9:55 pm
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కాల పరిమితి తీరిపోయిన నేపథ్యంలో కొత్తగా పాలక మండలిని ఏర్పాటు…
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…
భారత దేశంలో గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ కి గతమంతా ఘనం. అయితే, కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా AI,…
రాప్తాడు జడ్పీ హైస్కూల్లో ఓ బాలికపై ఒక ఉన్మాది పాశవికంగా దాడి చేసిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…
గత శుక్రవారం రిలీజైన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వీకెండ్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే ఈ…