గత శుక్రవారం రిలీజైన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వీకెండ్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే ఈ సినిమాను అనుకోని వివాదం చుట్టుకుంది. ‘పర్ణశాల’ అనే చిన్న సినిమాలో ఉన్న ‘జిమ్ జిమ్ తార’ పాటను ఈ సినిమాలో పెట్టేశారనే ఆరోపణలు వచ్చాయి. ‘ఆదర్శ కుటుంబం’ మీద ‘పర్ణశాల’ లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈ పాట ద్వారా పాపులారిటీ సంపాదించిన కర్నూలకు చెందిన లక్ష్మి అనే మహిళ అయితే.. నేరుగా వెంకటేష్ అండ్ టీంకు గట్టి వార్నింగులు ఇచ్చేసింది. తన పాటను అనుమతి లేకుండా వాడేసుకున్నారని, డబ్బులు కూడా ఇవ్వలేదని.. కేసులు పెడతానని ఆమె హెచ్చరించింది. కానీ ఆమె ఇలా మాట్లాడిన కొన్ని గంటలకే ‘ఆదర్శ కుటుంబం’ ఆమెతో సారీ చెప్పించుకుందన్నది లేటెస్ట్ న్యూస్.
‘జిమ్ జిమ్ తార’ పాటకు సంబంధించిన హక్కులు ఆదిత్య మ్యూజిక్ సంస్థ దగ్గర ఉన్నాయట. ఆ సంస్థ నుంచి ‘ఆదర్శ కుటుంబం’ టీం అనుమతి తీసుకునే తమ సినిమాలో చిన్న బిట్ పెట్టుకుందట. కానీ అదేం తెలియకుండా ‘ఆదర్శ కుటుంబం’ టీంకు వార్నింగులు ఇచ్చేశారు లక్ష్మి. ‘పర్ణశాల’ మేకర్స్ కూడా ఈ సమాచారం లేకుండానే లీగల్ యాక్షన్ అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేశారా అన్నది ప్రశ్న. చూస్తుంటే ఆ చిన్న సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఆడుతున్న గేమ్ లాగా ఉంది.
ఇంతకుముందు ‘కుర్చీ మడత పెట్టి’ పాటను కంపోజ్ చేసినపుడు కూడా ఆ మాట క్రియేట్ చేసిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి రైట్స్ తీసుకున్నాడు తమన్. ఇప్పుడు ‘జిమ్ జిమ్ తార’ విషయంలోనూ అధికారికంగా రైట్స్ తీసుకునే సినిమాలో పెట్టారని అర్థమవుతోంది. ఇంతకీ ఈ అసలు పాటను తమ సినిమాలో పెట్టుకున్న చిన్న సినిమా.. ప్రేక్షకులను ఏమేర రీచ్ అవుతుంది, ఎలాంటి ఫలితాన్నందుకుంటుంది అన్నదే ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates