తెలుగు సినిమాలను బాగా కాపీ కొట్టే ఇండస్ట్రీల్లో కన్నడ సినీ పరిశ్రమ ఒకటి. అక్కడ స్టార్ హీరోలు చేసే సినిమాల్లో సగానికి సగం తెలుగు రీమేక్‌లే ఉంటాయి. ఇక్కడ హిట్టయ్యే ప్రతి సినిమానూ కన్నడ ఫిలిం మేకర్స్ రీమేక్ చేసి పడేస్తుంటారు. మన స్టార్లను అక్కడి యంగ్ హీరోలను అనుకరించడం కూడా జరుగుతుంటుంది. రీమేక్ సినిమాల్లో ఇలాంటి అనివార్యం అనుకోవచ్చు. ఐతే ఇప్పుడు ఒక స్ట్రెయిట్ కన్నడ సినిమాలో ఓ యంగ్ హీరో.. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కాపీ కొట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ హీరో.. నిఖిల్ గౌడ.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టుతో తెరకెక్కిన ‘జాగ్వార్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి తెలుగువాడే అయిన మహదేవ్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా అనుకున్నంత ఆడలేదు కానీ.. నిఖిల్ హీరోగా ఓ మాదిరిగా నిలదొక్కుకున్నాడు శాండిల్‌వుడ్‌లో.
ఇప్పుడు నిఖిల్ మరో తెలుగు దర్శకుడైనా విజయ్ కుమార్ కొండాతో జట్టు కట్టాడు. వీరి కలయికలో ‘రైడర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే ‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ గుర్తుకొచ్చాడు అందరికీ. అచ్చం బన్నీ లాగే పరిగెడుతున్నట్లుగా ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ఇప్పుడు టీజర్ చూస్తే.. అందులోనూ అల్లు అర్జున్ అనుకరణ స్పష్టంగా కనిపించింది.
‘సరైనోడు’ సినిమాలో బన్నీ ఫైట్లను యాజిటీజ్ దించేశాడు నిఖిల్. ‘సరైనోడు’లో బన్నీ రౌడీని వంగోబెట్టి జెట్ స్పీడులో మోచేతులతో గుద్దే ఫైట్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. అలాగే బన్నీ ఫైట్ మధ్యలో స్లో మోషన్లో నడుస్తూ ముందుకెళ్లే షాట్ కూడా ప్రేక్షకులకు అలా గుర్తుండిపోయింది. ఈ రెండు షాట్లూ ‘రైడర్’ టీజర్లో కనిపించాయి. దీంతో ఈ సినిమా ‘సరైనోడు’కు రీమేకా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ ‘రిటన్ అండ్ డైరెక్టెడ్ బై’ అని విజయ్ వేసుకున్నాడు కాబట్టి సొంత కథే అనుకోవాలి. పైగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల రీమేక్ అయ్యే అవకాశం లేనట్లే. మరి స్ట్ర్రెయిట్ మూవీలో బన్నీని నిఖిల్ అలా ఎందుకు అనుకరించాడో ఏమో?
This post was last modified on January 23, 2021 10:15 am
సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో.. వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి.…
దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన…
ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు.…
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…
ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా..…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…