ఇంకో ఆరు రోజుల్లో రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది. చాలా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో రోజువారి ట్రెండింగ్ కొంచెం నెమ్మదిగా ఉన్నట్టు అనిపిస్తున్నా రిలీజ్ రోజుకు దురంధర్ ది రివెంజ్ ని దాటుతుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉన్నాయి. ఏపీ తెలంగాణలో పంపిణి చేస్తున్న దిల్ రాజు ఆల్రెడీ ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టించారు. తెలుగు వెర్షన్ కు బిసి సెంటర్స్ లో మంచి రెవిన్యూ వస్తుందని భావిస్తున్నారు. దీపావళి పండగ అడ్వాంటేజ్ కానుంది.
అయితే చాలా మందికి ఒక అనుమానం లేకపోలేదు. సెన్సార్ జరిగిన ఫైనల్ వెర్షన్ నిడివి 3 గంటల 15 నిముషాలు. ఇందులో రామ రావణులకు ఎంత లెన్త్ వచ్చిందనేది అందులో ప్రధానమైంది. ముంబై టాక్ ప్రకారం రావణుడిగా నటించిన యష్ స్క్రీన్ స్పేస్ 1 గంట 5 నిముషాలు ఉంటుందట. మిగిలిన 2 గంటల 10 నిమిషాలలో అధిక శాతం రన్బీర్ కపూర్, సాయిపల్లవితో పాటు ఇతర ఆర్టిస్టులు పంచుకుంటారన్న మాట. యష్ ఇంట్రో, జటాయు ఎపిసోడ్, క్లైమాక్స్ చాలా బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్.
బిజినెస్ పరంగా వేయి కోట్లకు పైగా టార్గెట్ పెట్టుకున్న రామాయణకు బ్రేక్ ఈవెన్ కావాలంటే అదిరిపోయే టాక్ రావాలి. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ప్రీమియర్ నుంచి మిశ్రమ స్పందన, పాజిటివ్ రెస్పాన్స్ రెండూ రావడంతో కొంత అయోమయం నెలకొంది. కాకపోతే ఇతర భాషల్లో రామాయణకు పోటీ నెలకొనడంతో సోలోగా ఉండటం సాధ్యపడటం లేదు. సూర్య సీన్, నయనతార మహాశక్తితో పాటు వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె 47 కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి.
నితేశ్ తివారి దర్శకత్వం వహించిన రామాయణ పార్ట్ 1 మీద నిర్మాత నమిత్ మల్హోత్రా చూపిస్తున్న ధీమా అంతా ఇంతా కాదు. పబ్లిసిటీ ఎంత చేసినా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం భీభత్సమైన హైప్ కనిపించడం లేదు. దీంతో భారం మొత్తం టాక్ మీదే ఉంది. డబ్బింగ్, విఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. బ్రహ్మాస్త్ర లాగా దీనికి దక్షిణాదిలోనూ మంచి ఆదరణ దక్కుతుందని రన్బీర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సీతగా తనను ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ సాయిపల్లవిలో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates