2027 సంవత్సరంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు రిలీజవుతున్నాయి. కానీ వాటిలో అత్యధిక అంచనాలున్నది వారణాసి మీదే అంటే ఎవ్వరూ ఖండించరు. బాహుబలి, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ స్థాయికి ఎదిగిపోయిన రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదట్నుంచి భారీ అంచనాలున్నాయి. దీని కోసం గ్లోబల్ లెవెల్లో ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
వచ్చే ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అని ఏడాది కిందటే ప్రకటించినప్పటికీ.. రాజమౌళి సినిమాలంటే ఆలస్యం కావడం, వాయిదా పడడం కామన్ కావడంతో ఇది కూడా ఆ జాబితాలో చేరుతుందేమో అని భయపడుతున్నారు. పైగా ఈ మధ్య డ్రాగన్, ఫౌజి, స్పిరిట్ లాంటి పలు భారీ చిత్రాలు వాయిదా పడగా, వారణాసి కూడా ఆ జాబితాలో చేరబోతోందనే ప్రచారం మొదలైంది.
ఐతే వారణాసి టీం మాత్రం ఈ ప్రచారంపై ఏమీ స్పందించకుండా తమ పని తాము చేసుకుంటోంది. రిలీజ్ గురించి టీంలో ఎవరో ఒకరు కొంచెం గట్టిగా చెబితే బావుండని అనుకుంటుండగా.. రాజమౌళి తండ్రి, వారణాసి కథకుడు విజయేంద్ర ప్రసాద్ లైన్లోకి వచ్చారు.
గురువారం ఆయన డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ అనే చిన్న సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ వారణాసి అప్‌డేట్ ఇవ్వమని అడిగింది. దానికాయన బదులిస్తూ.. ఏప్రిల్ 7న రిలీజ్ అని ఆల్రెడీ అప్‌డేట్ ఇచ్చాం కదా అన్నారు. ఐతే యాంకర్ నిజంగానే వారణాసి ఆ డేట్‌కు వస్తుందా అండీ అని ప్రశ్నించింది. దానికాయన కచ్చితంగా చెప్పిన డేట్‌కే వస్తుంది అని ధీమాగా చెప్పారు.
ఈ మాట దీంతో వారణాసి ఫ్యాన్స్‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే. ఇలా ధీమాగా చెప్పాక కూడా వాయిదా పడ్డ సినిమాలు లేకపోలేదు కానీ.. ప్రస్తుతానికైతే వారణాసి ఏప్రిల్ 7 రిలీజ్ ప్రణాళికల్లోనే ఉందన్న క్లారిటీ రావడం అభిమానులకు హ్యాపీ న్యూసే. వారణాసి చిత్రీకరణ చివరి దశలో ఉందని, నవంబరులోనే గుమ్మడికాయ కొట్టేస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on October 30, 2026 10:54 am
తింటే గారెలు తినాలి.. అలానే పుల్లారెడ్డి స్వీట్స్ తినాలి! అంటూ దాదాపు 50 ఏళ్లుగా తెలుగు వారి నోటిని తీపి…
పెద్దగా ప్రమోషన్ల హడావిడి లేకుండా రిలీజ్ కు ముందు కాసింత నెగటివ్ వైబ్స్ తో వచ్చిన జైలర్ 2 అనూహ్యంగా…
త్రివిక్రమ్ రచనలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి కల్ట్ మూవీస్ చేశాడు విక్టరీ వెంకటేష్. ఐతే మాటల మాంత్రికుడి…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది సామెత. అదిప్పుడు నిజమయ్యే సూచనలు కానవస్తున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు…
తమిళనాడు సిఎం జోసెఫ్ విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తన తొలి ప్రయత్నం సిగ్మాతో చేయడం అది దారుణంగా…
లోకనాయకుడు కమల్ హాసన్ లేట్ ఏజ్ లోనూ తనదైన ప్లానింగ్ తో వాహ్ అనిపిస్తున్నారు. ఇది కేవలం సినిమాల్లో నటించడం…