ప్యారడైజ్ థియేటర్ రన్ అయిపోయి రోజులు గడిచిపోయాయి. నైజామ్ మినహాయించి మిగిలిన చోట్ల డిజాస్టర్ కావడం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది త్వరగా గుర్తించిన నాని అనవసర హడావిడి చేయకుండా రిలీజైన తక్కువ సమయంలో పక్కకు వెళ్ళిపోయి బ్లడీ రోమియో సెట్స్ లో అడుగు పెట్టేశాడు. అయితే ఇక్కడితో కథ అయిపోలేదు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ప్యారడైజ్ మరోసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెంట ట్రోలింగ్ భూతాన్ని పంపించి భయపెడుతోంది.
ప్రమోషన్స్ టైంలో నాని చెప్పిన నీ ఇష్టం శ్రీకాంత్ మాటతో మొదలుపెట్టి ప్యారడైజ్ లో రకరకాల వీడియో క్లిప్పులు కట్ చేసుకొచ్చి మరీ సోషల్ మీడియాలో తలంటుతున్నారు. మాములుగా అయితే నెట్ ఫ్లిక్స్ లో నేరుగా స్క్రీన్ రికార్డింగ్ చేయడం, క్లిప్పులు కట్ చేయడం అసాధ్యం. అందుకే పైరసీ హెచ్డి ప్రింట్లను డౌన్ లోడ్ చేసుకుని మరీ ట్రోలర్స్ రెచ్చిపోవడం చూస్తే వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా టీమ్ సైలెంట్ ఉంది తప్ప కాపీ రైట్స్ లాంటివి వేయట్లేదు.
ఇదంతా శ్రీకాంత్ ఓదెల చూడటం లేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎక్స్ ఇన్స్ టాలతో టచ్ లేకుండా సినిమా సెలబ్రిటీలు ఉండటం చాలా కష్టం. పబ్లిక్ పల్స్ తెలియాలన్నా, తమ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నా ఇవి ప్రధాన మాధ్యమాలు. తన మీద కురుస్తున్న విమర్శల జడివానలో శ్రీకాంత్ తడుస్తూ ఉంటారు. ఇదే అనుభవం జనవరిలో మారుతీకి ఎదురయ్యింది. రాజా సాబ్ మిగిల్చిన పీడకల అంత సులభంగా మర్చిపోయేది కాదు.
టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి డిజాస్టర్లు ఎన్నో ఉన్నాయి. ప్రతి స్టార్ హీరోకు ఇవి అనుభవమే. మృగరాజు, మహారథి, షాడో, కేడి, బాబీ, శక్తి, అజ్ఞాతవాసి, వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది పెద్ద సినిమాలు కనిపిస్తాయి. ప్యారడైజ్ కూడా అదే బాపతే. కాకపోతే కరుణ జాలి అనేది ఏ కోశానా లేని ఆన్ లైన్ ప్రపంచంలో రిలీజయ్యింది కాబట్టి ఇదంతా భరించాల్సి వస్తుంది. ఇదంతా ఓకే కానీ ఇంతకీ శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ ఎవరితో అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. చిరంజీవిది పెండింగ్ పడిపోయింది.
This post was last modified on October 24, 2026 10:10 pm
ఇటీవలే విడుదలైన హారర్ మూవీ 418 బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. టాక్ మరీ యునానిమస్ గా రాకపోయినా…
ఏపీలో జరుగుతున్న స్థానిక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర…
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో కీలకంగా భావించే ఈ స్థానం..…
నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ…
విజయ్ దేవరకొండ కొత్త సినిమా రణబాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వచ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వరకు…
కలర్ ఫొటో, బేబీ, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి రాజేష్.…