Political News

పునేఠా పార‌ద‌ర్శ‌క‌త‌కు ఇదే నిద‌ర్శ‌నం జ‌గ‌న్‌

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక‌, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర పునేఠా స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ రెండు రోజుల కింద‌ట తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. సీఎం చంద్ర‌బాబుకు ఆయ‌న స్నేహితుడ‌ని.. అందుకే చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్టు ప్ర‌కార‌మే ఆయ‌న ముందుకు సాగుతున్నార‌ని కూడా విమ‌ర్శించారు. ఎన్నిక‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌డం లేద‌ని కూడా ఎత్తి చూపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు. అయితే.. పునేఠా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు ఇదీ.. నిద‌ర్శ‌నం అంటూ టీడీపీ తాజాగా జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చింది.

వైసీపీ నాయ‌కురాలు.. మాజీ మంత్రి విడదల రజినిపై ఓ మ‌హిళా ఎస్సై శుక్ర‌వారం దురుసుగా ప్ర‌వ‌ర్థించింది. మాజీ మంత్రి అనే ప్రొటోకాల్ ను కూడా ప‌క్క‌న పెట్టి ఆమెను నెట్టేసింది. దీంతో ర‌జ‌నీ.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా రాలేక పోగా.. ఆమె వెల్ల‌కిలా కింద‌కు ప‌డిపోయారు. ఈ స‌మ‌యంలో మీడియా కూడా అక్క‌డే ఉండ‌డంతో స‌ద‌రు వీడియోలు పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. స‌హజంగా ఇలాంటి వాటిని ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న సాధార‌ణ విష‌యాలుగా పేర్కొని ఎన్నిక‌ల సంఘం మౌనంగా ఉండొచ్చు. కానీ, పునేఠా అలా అనుకోలేదు. పోలీసుల దురుసు ప్రవర్తన ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.

చిలకలూరిపేట రూరల్‌ ఎస్‌ఐ ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు సాధారణ విధుల నుంచీ తక్షణమే తప్పించాలని పునేఠా ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విధుల నుంచి తప్పించాలని పల్నాడు ఎస్పీకి లిఖిత పూర్వ‌క ఆదేశాల‌ను పంపించారు. అంతేకాదు… మంత్రిపై చేయి చేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఎస్సై ప్రియాంక‌ ఘటనపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరపాలని ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు. మీడియా కథనాలు, అందుబాటులో ఉన్న వీడియోలు పరిశీలించి, సంబంధితుల వాంగ్మూలాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్‌ఐని విధుల నుంచి తప్పించిన నివేదికను త‌క్ష‌ణ‌మే త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని కూడా పునేఠా త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు. విచారణ, చర్యల నివేదికను నవంబర్‌ 5లోగా అందించాలని ఆదేశించారు. మొత్తంగా వైసీపీ చెబుతున్న‌ట్టుగా కాకుండా.. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా పునేఠా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై టీడీపీ నేత‌లు జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇస్తున్నారు.. మీ హ‌యాంలో ఎప్పుడైనా ఇలా జ‌రిగిందా జ‌గ‌న్ అని నిల‌దీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ర‌జ‌నీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన మాట వాస్త‌వం. కాగా.. తాజా నిర్ణ‌యంతో ఆమె కోర్టుకు వెళ్లే ఆలోచ‌న‌ను వెన‌క్కి తీసుకున్న‌ట్టు తెలిసింది.

This post was last modified on October 24, 2026 8:47 pm

Share

Recent Posts

శ్రీకాంత్‌ను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు

ప్యారడైజ్ థియేటర్ రన్ అయిపోయి రోజులు గడిచిపోయాయి. నైజామ్ మినహాయించి మిగిలిన చోట్ల డిజాస్టర్ కావడం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది…

51 minutes ago

వంగవీటి రాధా స్పీడ్ పెంచాలి

విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థులుగా ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో కీల‌కంగా భావించే ఈ స్థానం..…

1 hour ago

మాట నిలబెట్టుకుంటే అదే పెద్ద కానుక

నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ…

2 hours ago

సూపర్ హిట్ రణబాలి అని పిలవండి

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా ర‌ణ‌బాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వ‌చ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వ‌ర‌కు…

2 hours ago

కొబ్బరి మట్టను ఈసారైనా చూస్తారా

క‌ల‌ర్ ఫొటో, బేబీ, చెన్నై ల‌వ్ స్టోరీ చిత్రాల‌తో టాలీవుడ్లో త‌న‌కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి రాజేష్‌.…

2 hours ago

నీటి కష్టాల్లో రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని నగరవాసులు ఎదుర్కోవాల్సి…

4 hours ago