Political News

వంగవీటి రాధా స్పీడ్ పెంచాలి

విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థులుగా ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో కీల‌కంగా భావించే ఈ స్థానం.. అధికార కూట‌మికి అత్యంత కీల‌కం. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన కాక‌పోయినా.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీకి కూడా అంతే ఇంపార్టెంట్. అయితే.. వీరి మ‌ధ్య‌లో ఇండియా కూట‌మి బ‌ల‌ప‌రిచిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా.. అమీతుమీకి రెడీ అయ్యారు. ఇక్క‌డ స‌క్సెస్ అయితే.. రాష్ట్రంలో ఆయ‌న చ‌క్రం తిప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

62 ఏళ్ల వ‌య‌సులో ఏబీవీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నామినేష‌న్ వేసిన రోజు నుంచి కూడా ఏబీవీ ప్ర‌చారం ప్రారంభించేశారు. అప్ప‌టి నుంచి కూడా ఆయ‌న ప‌క్క ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీల సంఖ్య‌ను కూడా పెంచుకుంటున్నారు. ఇండియా కూట‌మిలోని కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులు స‌హా.. ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను కూడా క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. ప్ర‌ధాన పార్టీల‌కంటే కూడా ముందుగానే ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు. త‌న ల‌క్ష్యాల‌ను వివ‌రిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ నుంచి కూట‌మి త‌ర‌ఫున ఇక్క‌డ నామినేష‌న్ వేసిన యువ నేత‌.. వంగ‌వీటి రాధాకృష్ణ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రో మూడు రోజులు మాత్ర‌మే ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌మ‌యం ఉంది. ఈ క్ర‌మంలో కార్పొరేష‌న్ ప‌రిధిలోని 69 డివిజ‌న్ల‌లో ఆయ‌న పూర్తి స్థాయి ప్ర‌చారం ఎప్పుడు ప్రారంభిస్తారు? కూట‌మి నాయ‌కులను ఎప్పుడు సంతృప్తి ప‌రుస్తారు.. అనే అంశాలు ఆస‌క్తిగా మారాయి.

అయితే.. తాను బ‌య‌ట‌కు వ‌చ్చినా.. రాకున్నా కూట‌మి ప్ర‌భుత్వానికి ఉన్న ఇమేజ్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉన్న ఇమేజ్ త‌న‌ను కాపాడుతుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇది స‌రికాద‌న్న అభిప్రాయాలు కూట‌మి నాయ‌కుల మ‌ధ్యే ఉన్నాయి. మ‌రోవైపు.. ఈ సీటును ఆశించి ఓ ఎమ్మెల్యే తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్నా ర‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఆయ‌న అనుచ‌రులే.. ప‌లు వార్డుల్లో రెబ‌ల్స్‌గా రంగంలోకి దిగి.. ఓటు చీల్చే ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ఏబీవీ కంటే కూడా ఎక్కువ‌గానే రాధా క‌ష్ట‌ప‌డా ల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 24, 2026 4:05 pm

Share

Recent Posts

శ్రీకాంత్‌ను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు

ప్యారడైజ్ థియేటర్ రన్ అయిపోయి రోజులు గడిచిపోయాయి. నైజామ్ మినహాయించి మిగిలిన చోట్ల డిజాస్టర్ కావడం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది…

4 minutes ago

మాట నిలబెట్టుకుంటే అదే పెద్ద కానుక

నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ…

55 minutes ago

సూపర్ హిట్ రణబాలి అని పిలవండి

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా ర‌ణ‌బాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వ‌చ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వ‌ర‌కు…

2 hours ago

కొబ్బరి మట్టను ఈసారైనా చూస్తారా

క‌ల‌ర్ ఫొటో, బేబీ, చెన్నై ల‌వ్ స్టోరీ చిత్రాల‌తో టాలీవుడ్లో త‌న‌కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి రాజేష్‌.…

2 hours ago

నీటి కష్టాల్లో రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని నగరవాసులు ఎదుర్కోవాల్సి…

3 hours ago

సోనియా గాంధీ లవ్ స్టోరీ ఎంత క్యూట్ గా ఉందో!

కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చాలా లో ప్రొఫైల్ మెయింటెన్…

3 hours ago